నిన్న జరిగిన అన్ స్టాపబుల్ టాక్ షో ఎపిసోడ్ షూటింగ్ సోషల్ మీడియాతో పాటు న్యూస్ ఛానల్స్ లోనూ పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఎన్నడూ లేనిది ఒక ఓటిటి ఇంటర్వ్యూ షోకి స్టూడియో బయట లైవ్ కవరేజ్ ఇవ్వడం ఇదే మొదటిసారి. అంతగా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ల కలయిక అందరికీ సెన్సేషన్ గా మారింది. పాసులున్న అతికొద్ది మందికి మాత్రమే సెల్ ఫోన్లు లేకుండా కార్యక్రమం చూసే వీలు కల్పించారు. వాళ్ళ నుంచి వచ్చిన లీకులు గట్టిగానే బయట తిరుగుతున్నాయి. అందులో పవన్ పెళ్లిళ్లపై అడిగిన ప్రశ్నకు సమాధానం విని సంతృప్తి చెందిన బాలయ్య ఇకపై ఆ టాపిక్ మీద కామెంట్ చేసేవాళ్లను శునకాలతో పోల్చారట.
మధ్యలో ఒకసారి రామ్ చరణ్ తో ఫోన్ కాల్ చేయించి సరదా సంభాషణ చేసారని తెలిసింది. సాయి ధరమ్ తేజ్ ప్రత్యక్షంగా వచ్చి బాలకృష్ణ స్టైల్ లో తొడకొట్టడం హై లైట్ గా ఉంటుందని అంటున్నారు. అంతే కాదు మోక్షజ్ఞని ప్రత్యేకంగా సెట్లోకి పిలిచి పవన్ తో ఫోటో తీయించిన వీడియో ఇద్దరి అభిమానులకు చాలా స్పెషల్ మూమెంట్ గా నిలిచిపోతుందని వినికిడి. త్రివిక్రమ్, క్రిష్ లు మధ్యలో వచ్చాక వాళ్ళతోనూ మాటామంతీ బాగా జరిగిందని టాక్. నిడివి ఎంతనేది బయటికి రాలేదు ఎడిటింగ్ పోనూ గంటకు పైగా ఫైనల్ ఫుటేజ్ లాక్ కావొచ్చని ఆహా వర్గాల సమాచారం.
అన్ స్టాపబుల్ సీజన్ 2ని ఇదే ఫైనల్ ఎపిసోడ్ గా ముగించబోతున్నట్టు తెలిసింది. మూడో సిరీస్ లోనే చిరంజీవి లాంటి వాళ్ళను ఆశించవచ్చు కానీ ప్రస్తుతానికి పవన్ ప్రభాస్ లే ఇప్పుడీ సెకండ్ సీజన్ ని కాచుకున్న బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ గా నిలవబోతున్నారు. అయితే సోషల్ మీడియాలో కొందరు అభిమానులు బాలయ్య పవన్ ల మీద పరస్పరం ట్రోలింగ్ కి దిగుతున్న సందర్భాలు ట్విట్టర్ వేదికగా కనిపిస్తున్నాయి. అక్కడ హీరోలేమో ఆనందంగా తమ బంధాన్ని ప్రదర్శిస్తుంటే కొందరు ఫ్యాన్స్ మాత్రం ఇలా బురద జల్లే కార్యక్రమం పెట్టుకోవడం బాధాకరం. సంక్రాంతికి పవన్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఉండొచ్చు
This post was last modified on December 28, 2022 1:49 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…