అక్కినేని ఫ్యామిలీ వేడుకలో అతనేంటి?

టాలీవుడ్లో ఇప్పుడు మాంచి ఊపు మీద ఉన్న యంగ్ హీరో అడివి శేష్. అతణ్ని టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకడని కూడా చెప్పొచ్చు. ఇటీవలే 38వ పుట్టిన రోజును జరుపుకున్న శేష్.. ఇంకా పెళ్లి ఊసు ఎత్తట్లేదు. ఏదైనా ఇంటర్వ్యూలో, లేదా టీవీ షోల్లో పెళ్లి ఊసు ఎత్తితే చాలు.. సమాధానం దాటవేస్తాడు.

ఐతే శేష్ సింగిల్ మాత్రం కాదన్నది అతడి సన్నిహిత వర్గాల మాట. టాలీవుడ్లో ఒక లేడీ ప్రొడ్యూసర్‌తో అతను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లుగా ప్రచారాలు జరగడం తెలిసిందే. ఐతే ఆమె ఎవరన్నది బహిరంగంగా ఎవరూ వెల్లడించలేదు. కానీ శేష్ ఈ విషయంపై తనే ఓపెన్ అయిపోయాడా అన్న చర్చ నడుస్తోంది ఇప్పుడు. ఈ చర్చకు అవకాశమిచ్చింది అక్కినేని ఫ్యామిలీ వారి క్రిస్మస్ సెలబ్రేషన్లకు సంబంధించి తాజాగా రిలీజ్ చేసిన ఒక ఫొటోనే.

ఇందులో పది మందికి పైగానే అక్కినేని కుటుంబ సభ్యులు ఉన్నారు. సుమంత్, సుశాంత్, అఖిల్, సుప్రియ.. ఇలా పలువురు అక్కినేని కుటుంబ సభ్యులు ఉన్న ఫొటోలో ఉన్న ఒకే ఒక ఔట్ సైడర్ అడివి శేష్. ఇది అందరిలోనూ క్యూరియాసిటీ రేకెత్తించింది. అతను సుప్రియ పక్కన ఉండడం మరింత చర్చకు తావిచ్చింది. శేష్ రిలేషన్‌షిప్‌లో ఉన్నది సుప్రియతోనే అన్న చర్చ ఒక్కసారిగా ఊపందుకుంది.

వీళ్లిద్దరికీ శేష్ నటించిన ‘గూఢచారి’ సినిమా టైంలో పరిచయం జరిగింది. ఆ సినిమాలో సుప్రియ నిర్మాణ భాగస్వామే కాక.. ఒక ప్రత్యేక పాత్ర కూడా పోషించింది. అప్పుడు మొదలైన వీరి పరిచయం తర్వాత ప్రేమకు దారి తీసినట్లుగా భావిస్తున్నారు. ఇన్నాళ్లూ శేష్ ఎవరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడనే విషయంపై ఎవరూ ఓపెన్‌గా మాట్లాడలేదు. కానీ తాజా ఫొటోతో శేష్, సుప్రియలిద్దరూ ఓపెన్ అయిపోయినట్లుగా భావిస్తుండడంతో దీనిపై చర్చోప చర్చలు నడుస్తున్నాయి.