Karthikeya 2 బ్లాక్ బస్టర్ తరువాత చేస్తున్న సినిమా కావడంతో 18 Pages మీద నిఖిల్ గట్టి నమ్మకమే పెట్టుకుంటూ వచ్చాడు. అయితే కంటెంట్ కొంచెం వైవిధ్యంగా ఉన్నప్పటికీ అన్ని వర్గాలను మెప్పించేలా దర్శకుడు సూర్య ప్రతాప్ తడబడటంతో ఏ సెంటర్లలో వసూళ్లు పర్వాలేదనిపిస్తే బీసీ కేంద్రాల్లో మాత్రం ట్రెండ్ కొంత డౌన్ లో ఉంది.
నిర్మాతలు మొదటి రోజే బ్రేక్ ఈవెన్ అయ్యిందని పోస్టర్ వేసుకున్నారు. నాన్ థియేట్రికల్ హక్కులు కలిపి మొత్తం పెట్టుబడి వచ్చేసిందనే ఉద్దేశంతో ఆ మాట అన్నప్పటికీ నిజానికి అలా చేయడం ట్రేడ్ లెక్కలో కౌంట్ కాదు. డిస్ట్రిబ్యూటర్లకు చేసిన బిజినెస్ టికెట్ల రూపంలో కలెక్ట్ చేస్తేనే పరిగణనలోకి వస్తుంది
సరే కాసేపు సినిమా బాగుండటం లేకపోవడం పక్కనపెడితే నిఖిల్ సినిమా రాంగ్ టైమింగ్ ని సెట్ చేసుకుంది. రవితేజ ధమాకాకు నేరుగా పోటీకి వెళ్లడం మాస్ ఆడియన్స్ పరంగా దెబ్బ కొట్టింది. అది కూడా అద్భుతంగా ఉందనే టాక్ రాకపోయినా కమర్షియల్ మాసాలాలు, శ్రీలీల గ్లామర్ ప్లస్ పాటలు వెరసి వీకెండ్ మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకుంది.
సహజంగానే 18 Pages మీద పెద్దగా ఆసక్తి పుట్టడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే కీలకమైన సోమవారం నుంచి మరింత ఆందోళనకరంగా ఉండే ప్రమాదం లేకపోలేదు. దీనికి బదులు డిసెంబర్ 30 లేదా 31 వచ్చి ఉంటే కొంతే బెటర్ మెంట్ ఉండేది
సంక్రాంతి సినిమాల సందడి జనవరి 12 నుంచి మొదలవుతుంది కాబట్టి చేతిలో రెండు వారాల టైం ఉండేది. 18 Pages లాంటివాటికి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చినా ఈ సమయం సరిపోతుంది. అలా కాకుండా అవతార్ కు భయపడి మూడో వారం వదిలేసి క్రిస్మస్ ని క్యాష్ చేసుకుందామని ధమాకాతో క్లాష్ అవ్వడం ఫైనల్ గా ప్రభావం చూపించేసింది.
నిఖిల్ పైకి ఎలా ఉన్నా ప్రమోషన్ల కోసం ఎంత తిరుగుతున్నా ఇప్పుడీ ఫలితం ఎంతో కొంత నిరాశ కలిగించేదే. ఇదీ బ్లాక్ బస్టర్ అయితే నెక్స్ట్ రాబోతున్న ప్యాన్ ఇండియా మూవీ స్పైకి ఉపయోగపడేది. కొన్నిసార్లు కంటెంట్ కన్నా టైమింగ్ కీలకం. ఋజువు కనిపిస్తోందిగా