డ్యాన్సుల విషయానికి వస్తే అందరి దృష్టీ హీరోల మీదే ఉంటుంది. ఆయా హీరోల అభిమానులు ఈ విషయంలో బాగా హైప్ చేస్తుంటారు. డ్యాన్స్ మాస్టర్ల దృష్టి కూడా ఎఫ్పుడూ హీరోల మీదే ఉంటుంది. వాళ్లకు ఏ స్టెప్ కంపోజ్ చేద్దాం.. అభిమానులను ఎలా ఎంగేజ్ చేద్దాం అనే చూస్తుంటారు. ఈ క్రమంలో హీరోయిన్ల డ్యాన్స్ గురించి ఎవరికీ పెద్ద పట్టింపు ఉండదు. చాలాసార్లు హీరోలకు దీటుగా హీరోయిన్లు స్టెప్పులు ఇరగదీస్తుంటారు. కానీ వాళ్ల గురించి మాట్లాడేవాళ్లు ఉండరు.
ఐతే హీరోయిన్ల విషయంలో డ్యాన్స్ కోసం చూడాలి అనిపించేలా చేసిన అతి కొద్దిమందిలో సాయిపల్లవి ఒకరు. ఆమె డ్యాన్స్ చేస్తుంటే హీరో గురించి మరిచిపోయి ఆమె మీదే దృష్టిపెడతారు ప్రేక్షకులు. ‘ఫిదా’తో అలా ఫిదా చేసేసింది ఆమె. డ్యాన్స్ నేపథ్యం నుంచే రావడం ఆమెకు ప్లస్ అయింది. రౌడీ బేబీ.. సారంగ దరియా లాంటి పాటలతో సాయిపల్లవి యూత్‌ను ఒక ఊపు ఊపేసిందనే చెప్పాలి.
తెలుగులో సాయిపల్లవి కాకుండా డ్యాన్స్ విషయంలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన హీరోయిన్లలో తమన్నా ఒకరు. ఐతే ఇప్పుడు టాలీవుడ్లోకి కొత్త డ్యాన్సింగ్ హీరోయిన్ వచ్చింది. ఆమే.. శ్రీలీల. తెలుగులో తన తొలి చిత్రం ‘పెళ్ళిసంద-డి’లోనే ఆమె స్టెప్పులకు మంచి పేరొచ్చింది. ‘మధురా నగరిలో..’ పాటలో ఆమె స్టెప్పులు అదరగొట్టిందనే చెప్పాలి. ఈ సినిమాతో తనపై పెరిగిన అంచనాలను ‘ధమాకా’తో ఈ కన్నడ భామ అందుకుంది. ఈ సినిమాలో అన్నీ ఊర మాస్ పాటలే.
వాటిలో శ్రీ లీల స్టెప్పులు.. ఆమె ఉత్సాహం.. హావభావాలు చూసి జనం పిచ్చెక్కిపోతున్నారు. ముఖ్యంగా యూత్‌కు ఆమె మామూలు కిక్కివ్వట్లేదు. ముఖ్యంగా ‘జింతాక్’ పాటలో ఏ శషబిషలు పెట్టుకోకుండా.. ఫ్రీ ఫ్లోతో ఆమె స్టెప్పులు ఇరగదీసింది. డ్యాన్సును మించి ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ మాంచి కిక్కిచ్చేవే. ఇంత ఫ్రీగా డ్యాన్స్ చేసే అమ్మాయిలు అరుదుగా ఉంటారు. ఇక ముందు ఆమె డ్యాన్స్ కోసమే థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు తయారైతే ఆశ్చర్యం లేదు.
This post was last modified on December 24, 2022 6:27 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…