Movie News

లాఠీ దెబ్బ ఇలా తగిలిందేంటబ్బా

ఒకప్పుడు మీడియం రేంజ్ మాస్ హీరోలతో సమానంగా తెలుగు మార్కెట్ ని ఎంజాయ్ చేసిన హీరో విశాల్. పందెం కోడి తన ఇమేజ్ ని పెంచడం అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేరు. ఆ తర్వాత వచ్చిన పొగరు, భరణి, భయ్యా లాంటివి కంటెంట్ యావరేజ్ గా ఉన్నా కమర్షియల్ కోణంలో నిర్మాతలకు వర్కౌట్ అయినవే. ఒకదశలో రిటర్న్స్ గ్యారెంటీ అనే ముద్ర సంపాదించుకున్నాడు. కానీ అదంతా గతం. గత కొన్నేళ్లుగా కనీస స్థాయిలో కంటెంట్ లేని సినిమాలతో విశాల్ క్రేజ్ బాగా డౌన్ అయిపోయింది. 2018లో అభిమన్యుడు హిట్ అయ్యాక ట్రాక్ లో పడ్డాడనుకుంటే కథ మళ్ళీ మొదటికే వచ్చింది.

తాజాగా రిలీజైన లాఠీ ఓపెనింగ్సే దానికి నిదర్శనం. చాలా చోట్ల నీరసమైన వసూళ్లతో షోలు ప్రారంభమయ్యాయి. ప్రమోషన్ పరంగా విశాల్ ఏ లోటు రాకుండా చూసుకున్నా ఆడియన్స్ లో ఆసక్తి రేపేందుకు అది ఉపయోగపడలేదు. సరే సినిమా బాగుంటే ఇవన్నీ మారిపోతాయి కానీ లాఠీ రిపోర్ట్స్ ,పబ్లిక్ టాక్, రివ్యూలు చూస్తుంటే మళ్ళీ నిరాశ తప్పలేదనే విషయం అర్థమైపోయింది. తనకు ఇంకా మాస్ పాత్రల్లోనే చూస్తారనే తప్పుడు అంచనాలో ఉన్న విశాల్ మరోసారి స్టోరీ సెలక్షన్ లో తప్పటడుగు వేశాడు. ఒక కోణంలో డిఫరెంట్ గా అనిపించే పాయింట్ ని దర్శకుడు వినోద్ రొటీన్ ఫార్మట్ లో తెరకెక్కించడంతో పెద్దగా మ్యాటర్ లేకుండా పోయింది

యుగాల నాటి పోలీస్ వర్సెస్ పవర్ ఫుల్ గూండా కాన్సెప్ట్ ని తీసుకున్న లాఠీ బృందం దాన్ని ఎంగేజ్ చేసే స్థాయిలో మలచలేకపోయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో అతిశయోక్తి మీరిపోయిన యాక్షన్ ఎపిసోడ్లు, అక్కర్లేని సెంటిమెంట్ కం ఎమోషన్, ఇంతకు ముందు చూసినట్టు అనిపించే సీన్లు వెరసి లాఠీ ఏ దశలోనూ మెప్పించలేక జారిపడిపోయింది. ఆ మధ్య సామాన్యుడు, చక్రలో చేసిన పొరపాట్లే విశాల్ మళ్ళీ రిపీట్ చేశాడు. ఇకనైనా ఈ మూస గోలకు స్వస్తి చెప్పి కొత్త తరం దర్శకులతో ట్రావెల్ అయితే తప్ప కంబ్యాక్ అవ్వడం కష్టం. లేకపోతే ఇదే రిజల్ట్ పునరావృత్తమవుతూనే ఉంటుంది.

This post was last modified on December 22, 2022 7:38 pm

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

2 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

7 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

9 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

10 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

10 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

10 hours ago