ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో, భారీ అంచనాల మధ్య విడుదలైంది ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’. ఈ సినిమా విషయంలో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరేమో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతమని, జేమ్స్ కామెరూన్ ఆవిష్కరించిన అద్భుతాలను చూడడానికి రెండు కళ్లూ చాలలేదని అంటుంటే.. మరికొందరేమో ఎఫెక్ట్స్ మీద పెట్టిన శ్రద్ధ.. కథాకథనాల మీద పెట్టలేదని.. లెంగ్త్ మరీ ఎక్కువ అయి సినిమా బోర్ కొట్టేసిందని కామెంట్ చేస్తున్నారు.
ఐతే తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో అయితే ‘అవతార్-2’ ప్యాక్డ్ హౌసెస్‌తో నడిచింది. దేశవ్యాప్తంగా కూడా త్రీడీ వెర్షన్లు చూడడానికి జనం పోటెత్తారు. ప్రపంచ స్థాయిలో కూడా ‘అవతార్’ తొలి రోజు భారీ వసూళ్లనే రాబట్టినట్లు తెలుస్తోంది. కానీ ఈ సినిమా మీద ఉన్న అంచనాలకు తగ్గట్లయితే వసూళ్లు వచ్చేలా లేవు.
ఇండియా వరకు చూస్తే ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ఆల్ టైం హైయెస్ట్ హాలీవుడ్ గ్రాసర్ రికార్డును బద్దలు కొట్టలేకపోయింది. మూడేళ్ల కిందట ‘అవెంజర్స్: ది ఎండ్ గేమ్’ రూ.53 కోట్ల గ్రాస్ వసూళ్లతో కొత్త రికార్డు నెలకొల్పింది. ‘అవతార్-2’ ఎప్పుడు వస్తే అప్పుడు ఈ రికార్డు బద్దలు కావడం లాంఛనమే అనుకున్నారు.
అందులోనూ ఈ సినిమా రిలీజ్ వీక్‌లో ఏ భాషలోనూ చెప్పుకోదగ్గ రిలీజ్‌లు లేవు. పూర్తిగా ఇండియన్ బాక్సాఫీస్‌ను ఈ సినిమాకే రాసిచ్చేశారు. ‘అవెంజర్స్’తో పోలిస్తే ఈ సినిమా మీద ఉన్న అంచనాలు ఎక్కువ. అలాగే టికెట్ల ధరలు కూడా ఎక్కువే. కాబట్టి రికార్డు బద్దలవడం పక్కా అనుకున్నారు.
కానీ ‘అవతార్-2’ ఇండియా డే-1 వసూళ్లు రూ.40 కోట్లకు అటు ఇటుగా ఉన్నట్లు ట్రేడ్ పండిట్ల అంచనా. మామూలుగా చూస్తే ఇది చాలా పెద్ద నంబరే. బాలీవుడ్ భారీ చిత్రాలు అందులో సగం కూడా రాబట్టలేకపోతున్న రోజుల్లో ఈ వసూళ్లు గొప్ప అనే చెప్పాలి. కానీ సినిమా మీద ఉన్న భారీ అంచనాలు, అనుకూల బాక్సాఫీస్ పరిస్థితుల్లో ‘అవతార్-2’ అండర్ పెర్ఫామ్ చేసినట్లే.
This post was last modified on December 17, 2022 2:17 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…