ఆది పినిశెట్టి హీరో పాత్రలకు పరిమితం అయిపోకుండా విలన్ క్యారెక్టర్స్, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీ యాక్టర్ అయిపోయాడు. ఎలిజిబుల్ బాచిలర్ అయినా కానీ ఇంతకాలం పెళ్లి చేసుకొని ఆది త్వరలో ఒకింటివాడు కాబోతున్నాడని గట్టి గాసిప్స్ వినిపిస్తున్నాయి. వాటికి ఆజ్యం పోసింది అతనే అనుకోండి.
తన తండ్రి రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యులతో జరురుపుకుని ఆ ఫోటోని ఆది షేర్ చేసాడు. పినిశెట్టి కుటుంబ చిత్రపటంలో హీరోయిన్ నిక్కీ గాల్రాని ఉండడంతో ఆమెకు అక్కడేం పని అనే ఆరాలు మొదలయ్యాయి.
ఇద్దరూ కలిసి మలుపు, మరకతమణి సినిమాల్లో నటించారు. అయితే ఈ కరోనా వేళ ఆమె పనిగట్టుకుని అతని తండ్రి పుట్టినరోజు వేడుకకు వెళ్లాల్సిన పనిలేదు. దీనిని బట్టి ఆమె ఆ కుటుంబానికి ఎంత సన్నిహితం అయినదో అర్థమవుతోందని… ఈ ఫోటో ద్వారా ఇన్నాళ్లు సీక్రెట్ గా ఉన్న ఆది ప్రణయ గాధ బయట పడిందని ప్రచారం జోరందుకుంది. ఈ ఫోటో పెట్టినప్పుడే ఈ విధమయిన రియాక్షన్ ఆది ఊహించే ఉంటాడనుకోండి.
Gulte Telugu Telugu Political and Movie News Updates