విక్టరీ వెంకటేష్ ఎందుకో ఉన్నట్లుండి జోరు తగ్గించేశారు. చాలా ఏళ్ల నుంచి ఒకదాని తర్వాత ఒకటి వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఈ సీనియర్ హీరో.. ఒక దశలో ఒకేసారి రెండు సినిమాల్లోనూ నటించారు. అలాంటిది ‘ఎఫ్-3’ విడుదలై ఆరు నెలలు కావస్తున్నా తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. మధ్యలో ‘ఓరి దేవుడా’ సినిమాలో చిన్న క్యామియో చేయడం తప్పితే.. వెంకీ యాక్టివ్‌గా లేడు. తన కొత్త చిత్రం విషయంలో వెంకీ ఇంత టైం తీసుకోవడం ఈ మధ్య కాలంలో చూడలేదు.
ఐతే వెంకీకి ఉద్దేశపూర్వకంగా బ్రేక్ తీసుకునే ఆలోచనేమీ ఉన్నట్లు లేదు. ముందు అనుకున్న ప్రాజెక్టులు కుదరక ఆయనకు అనుకోకుండా ఈ గ్యాప్ వచ్చేసింది. తరుణ్ భాస్కర్‌తో అనుకున్న కథ వర్కవుట్ కాక అది అటకెక్కేయగా.. మధ్యలో అనుదీప్ కేవీ పేరు తెరపైకి వచ్చింది. వెంకీతో మాంచి ఎంటర్టైనర్ తీయాలని అనుదీప్ అనుకున్నాడు.
కానీ ‘జాతిరత్నాలు’ తర్వాత తనపై పెరిగిన అంచనాలను ‘ప్రిన్స్’తో అనుదీప్ అందుకోలేకపోయాడు. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబుకు అనుదీప్ మీద గురి కుదరలేదో ఏమో.. వెంకీతో ఈ యువ దర్శకుడి సినిమాను హోల్ట్‌లో పెట్టినట్లున్నారు. కాగా ఇప్పుడు వెంకీ లిస్టులోకి కొత్త దర్శకుడు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడే శైలేష్ కొలను. ‘హిట్’ ఫ్రాంఛైజీతో ఈ యంగ్ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీలో బాగా నానుతోంది. ముఖ్యంగా ‘హిట్-2’ బ్లాక్‌బస్టర్ కావడంతో శైలేష్‌తో సినిమా చేయడానికి స్టార్లు కూడా ఆసక్తితో ఉంటారనడంలో సందేహం లేదు.
ఐతే ఆల్రెడీ ‘హిట్-3’ని అనౌన్స్ చేసిన శైలేష్.. దానికంటే ముందు వెంకీతో ఒక క్రైమ్ థ్రిల్లర్ తీయాలని చూస్తున్నట్లు సమాచారం. వెంకీకి అతను ఒక కథ కూడా వినిపించినట్లుగా వార్తలొస్తున్నాయి. ‘విక్రమ్’ స్టయిల్లో ఈ సినిమా ఉండొచ్చని అంటున్నారు. శైలేష్ లిమిటెడ్ బడ్జెట్లో, వేగంగా సినిమా తీస్తాడు కాబట్టి సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు రావచ్చు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు.
This post was last modified on December 16, 2022 6:12 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…