స్టార్ హీరోకు ఒకే సంగీత దర్శకుడు సింక్ అవ్వడమనేది ఈ మధ్య కాలంలో చాలా అరుదైపోయింది. స్థిరంగా హిట్లిచ్చే మ్యూజిక్ డైరెక్టర్లు బాగా తగ్గిపోయారు. ఒకప్పుడు మణిశర్మ ఈ రేంజ్ స్టార్ డం బాగా ఎంజాయ్ చేశారు. చిరంజీవి బాలకృష్ణలతో మొదలుకుని అప్పుడే ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు దాకా అందరికీ ఆయనే బెస్ట్ ఛాయస్ గా ఉండేవారు. వాళ్ళ అంచనాలకు తగ్గట్టే ఎన్ని అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చారో లెక్క లేదు. తొంభై దశకంలో ఇళయరాజా ప్రభంజనం ఇంతకు మించి ఉండేది. ఒక టైంలో దేవిశ్రీ ప్రసాద్ ఈ దశను బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు బాలయ్యకు తమన్ ఇలాగే సింక్ అవుతున్నాడు.
ఇవాళ ప్రారంభమైన ఎన్బికె 108కు ముచ్చటగా మూడో సారి బాలకృష్ణతో తమన్ కాంబినేషన్ సెట్ అయ్యింది. అఖండ గురించి ఇప్పటికీ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూనే ఉంటారు. వీరసింహారెడ్డికి ఇచ్చిన స్కోర్ గురించి ఇన్ సైడ్ టాక్ చాలా పాజిటివ్ గా ఉంది. రిలీజైన ఒక పాట మీద ఫీడ్ బ్యాక్ సంగతి ఎలా ఉన్నా బీజీఎమ్ తో మాత్రం అదరగొట్టాడనే మాటే వినిపిస్తోంది. అంతగా మెప్పిస్తున్నప్పుడు తమన్ కాక ఇంకెవరిని ఎంచుకుంటారు. దర్శకుడు అనిల్ రావిపూడి వరసగా ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3 తరువాత దేవిశ్రీ ప్రసాద్ ని కాదని తమన్ కు ఎస్ చెప్పడం వెనుక బాలయ్య ప్రోత్సాహమేనని వేరే చెప్పాలా.
మొత్తానికి తమన్ టైం బ్రహ్మాండంగా ఉంది. సీనియర్లతో మొదలుకుని జూనియర్ల దాకా అందరికీ పని చేసిన అరుదైన ఘనతను గొప్ప ఆల్బమ్స్ తో బలపరుచుకుంటూనే ఉన్నాడు. ప్రస్తుతం తన చేతిలో రామ్ చరణ్ 15, మహేష్ బాబు 28 లాంటి చాలా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. విజయ్ వారసుడు దెబ్బకు కోలీవుడ్ నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. మధ్యలో సర్కారు వారి పాట లాంటి సినిమాలు తన స్థాయిలో లేవనే కామెంట్స్ తెచ్చుకున్నప్పటికీ స్టార్ హీరో ఎవరైనా సరే తర్వాతి బెస్ట్ ఆప్షన్ ఏదీ లేకుండా పోతున్న తరుణంలో తమన్ స్పీడుకు బ్రేకులు పడటం ఇప్పట్లో జరిగేలా లేదు. అందుకే ఓన్లీ ఛాయస్ గా అదరగొడుతున్నాడు.
This post was last modified on December 8, 2022 12:21 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…