Movie News

తెలుగు రాష్ట్రాల థియేట‌ర్ల‌న్నీ అజిత్‌కే

ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్ష‌కుల దృష్టి ప్ర‌ధానంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీర‌య్య‌, నంద‌మూరి బాల‌కృష్ణ చిత్రం వీర‌సింహారెడ్డి మీదే ఉండ‌బోతోంద‌న్న‌ది స్ప‌ష్టం. వీటికి తోడు విజ‌య్ అనువాద చిత్రం వార‌సుడు కూడా పెద్ద స్థాయిలోనే రిలీజ్ కాబోతోంది. అందుక్కార‌ణం ఆ చిత్రాన్ని నిర్మించింది టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కావ‌డ‌మే. దీని ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి కూడా తెలుగువాడేన‌న్న సంగ‌తి తెలిసిందే.

మెజారిటీ థియేట‌ర్ల‌ను ఈ మూడు చిత్రాల‌ను పంచుకుంటే.. మ‌రో అనువాద చిత్రం తునివు నామ‌మాత్రంగా రిలీజ‌వుతుంద‌ని అనుకున్నారంతా. అజిత్ న‌టించిన ఈ చిత్రాన్ని తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఐతే తెలుగు రాష్ట్రాల్లో మిగ‌తా మూడు సంక్రాంతి సినిమాల‌కు లేని అడ్వాంటేజ్ అజిత్ సినిమాకు ద‌క్క‌బోతుండ‌డం విశేషం.

సంక్రాంతికి పోటీయే లేకుండా సోలోగా ఒక్క రోజంతా బ్యాటింగ్ చేయ‌బోతున్న సినిమా తునివు మాత్ర‌మే. ఈ చిత్రం జ‌న‌వ‌రి 11, బుధ‌వారం రిలీజ్ కాబోతోంది. ఆ త‌ర్వాతి రోజు వీర‌సింహారెడ్డి, వార‌సుడు విడుద‌ల‌వుతాయి. 13న వాల్తేరు వీర‌య్య రాబోతోంది. సంక్రాంతికి భారీ పోటీ ఉండ‌డంతో ముందు వారం ఎలాగూ చెప్పుకోద‌గ్గ సినిమాలేవీ రిలీజ్ కావు. థియేట‌ర్ల‌న్నీ ఖాళీగా ఉంటాయి. కాబ‌ట్టి 11న రిలీజ‌య్యే తునివు చిత్రానికి కావాల్సిన‌న్ని థియేట‌ర్లు, షోలు ద‌క్కుతాయి.

సినిమాకు టాక్ బాగుండాలే కానీ.. వ‌సూళ్లు కుమ్మేసుకోవ‌చ్చు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హ‌క్కులు కూడా త‌క్కువ‌గా, రూ.3 కోట్ల‌కే ఇచ్చిన‌ట్లు స‌మాచారం. కాబ‌ట్టి మంచి ట్రైల‌ర్ వ‌దిలి హైప్ తీసుకురాగ‌లిగితే, డే-1 పెద్ద సంఖ్య‌లో థియేట‌ర్లు ద‌క్కుతాయి కాబ‌ట్టి రిక‌వ‌రీ చాలా ఈజీనే అవుతుంది.

This post was last modified on December 8, 2022 6:13 am

Share

Recent Posts

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

29 minutes ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

41 minutes ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

2 hours ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

4 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

4 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

5 hours ago