ప్రతీ సంక్రాంతి లానే వచ్చే ఏడాది సంక్రాంతి కి కూడా బడా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి. రెండు పెద్ద సినిమాలతో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమాలు రెండు థియేటర్స్ లోకి రానున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, తో పాటు తమిళ్ డబ్బింగ్ మూవీస్ విజయ్ ‘వారసుడు’ , అజిత్ ‘తునివు’ సంక్రాంతి స్పెషల్ గా తెలుగులో రిలీజ్ అవుతున్నాయి.
అయితే పొంగల్ బరిలో ఈ నాలుగు సినిమాలే కాదు తాజాగా మరో రెండు సినిమాలు కూడా లిస్టులో చేరాయి. సంతోష్ శోభన్ హీరోగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘కళ్యాణం కమనీయం’ అనే సినిమా సంక్రాంతి కే రాబోతుంది. కొన్ని రోజుల కిందటే నిర్ణయం తీసుకొని ప్రమోషన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. జనవరి 14న ఈ సినిమాకు రిలీజ్ డేట్ లాకైంది. త్వరలోనే ఫస్ట్ లుక్ లాంచ్ చేసి సంక్రాంతి రిలీజ్ డేట్ అఫీషియల్ గా చెప్పేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
అలాగే జనవరి 14నే సంక్రాంతి కానుకగా వివాహం అనే ఓ చిన్న సినిమా కూడా రాబోతుంది. రాహుల్ విజయ్ , శివాని రాజశేఖర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమాకు ఎప్పుడో ప్రమోషన్ స్టార్ట్ చేశారు కానీ ఇంత వరకూ ఎలాంటి బజ్ రాలేదు. తాజాగా ఈ సినిమాను సంక్రాంతికి వేస్తే అంతో ఇంతో మాట్లాడుకుంటారని, థియేటర్స్ తక్కువ వచ్చినా టాక్ బాగుంటే ఆక్యూపెన్సీ బాగుంటుందని భావించి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసేశారు. నాలుగు బడా సినిమాల మధ్యలో సంతోష్ శోభన్ సినిమా అంటే ఏవైనా కాస్త ఆలోచిస్తారేమో కానీ ఈ చిన్న సినిమాను ప్రేక్షకులు పట్టించుకుంటారా ? డౌటే.
అయితే 2017 లో చిరంజీవి ఖైదీ నంబర్ 150, బాలయ్య ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాలతో పాటు రిలీజైన మీడియం రేంజ్ సినిమా శతమానం భవతి ఆ ఏడాది పెద్ద సినిమాల నడుమ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఎవరూ ఊహించని విధంగా శర్వానంద్ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టి తర్వాత థియేటర్స్ పెంచుకుంది. మరి ఇప్పుడు సంతోష్ శోభన్ సినిమా కూడా అలా ఏమైనా అన్ ఎక్స్ పెక్టెడ్ హిట్ అవుతుందేమో చూడాలి. మరి కేవలం నెల రోజుల్లో ఈ సినిమా ప్రమోషన్స్ తో జనాల్లోకి తీసుకెళ్లడం యూవీ సంస్థకి పెద్ద ఛాలేంజే.
This post was last modified on December 7, 2022 8:14 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…