ఆల్రెడీ మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసినా.. నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతుండడాన్ని చాలా పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీలవుతున్నాడు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. అందుక్కారణం అతను బాలయ్యకు వీరాభిమాని కావడమే. కెరీర్ ఆరంభం నుంచి బాలయ్యతో సినిమా చేయడం తన అని అతను చెబుతూనే ఉన్నాడు.
ఇంతకుముందు ‘రామారావు’ అనే పేరుతో బాలయ్య హీరోగా ఓ సినిమా చేయడానికి ప్రయత్నించి విఫలమైన అనిల్.. ఎట్టకేలకు గత ఏడాది బాలయ్యకు ఓ కొత్త కథ చెప్పి ప్రాజెక్టు ఓకే చేశాడు. ఈ సినిమా ఇప్పటిదాకా మాటల వరకే పరిమితం. అయితే ఇప్పుడు సినిమాను అధికారికంగా ప్రకటించేశారు. ముహూర్త కార్యక్రమం కూడా చేసేస్తున్నారు. గురువారమే బాలయ్య 108వ సినిమాగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోబోతోంది.
సినిమా లాంచింగ్ గురించి వెల్లడిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం.. ఇందులో క్రూ వివరాలన్నీ వెల్లడించేసింది. ముందు నుంచి అనుకుంటున్నట్లే షైన్ స్క్రీన్స్ బేనర్ మీద ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సంస్థలో ఇప్పటికే మజిలీ, కృష్ణార్జున యుద్ధం, గాలి సంపత్, టక్ జగదీష్ లాంటి చిత్రాలు తెరకెక్కాయి. తన రచన, దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ‘గాలి సంపత్’ సినిమా తేడా కొట్టడంతో షైన్ స్క్రీన్స్ వాళ్లకు ఇంకో సినిమా చేస్తానని అనిల్ మాట ఇచ్చాడు. అందుకు తగ్గట్లే బాలయ్య లాంటి పెద్ద హీరోతో సినిమాను వారికి సెట్ చేసి పెట్టాడు.
ఇక బాలయ్య సినిమాలకు ఈ మధ్య ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయిన తమనే ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నాడు. అలాగే బాలయ్య ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్లలో ఒకడైన రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. రాజీవన్ లాంటి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్‌ను ఈ సినిమా కోసం ఎంచుకున్నాడు అనిల్. బాలయ్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రారంభోత్సవం రోజే టైటిల్ కూడా ప్రకటిస్తారని సమాచారం. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రియాంక జవాల్కర్, ఆయన కూతురిగా శ్రీలీల నటిస్తారని తెలుస్తోంది.
This post was last modified on December 7, 2022 8:02 pm
కొన్నేళ్ల నుంచి భారత్, పాకిస్థాన్ సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. ఈ ఏడాది ఆరంభంలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత అవి పూర్తిగా…
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…