Movie News

డిజాస్టరిచ్చాడు.. అయినా ధీమాగా ఉన్నారు

మామూలుగా ఒక పెద్ద డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడిని హీరోలు, నిర్మాతలు నమ్మి సినిమా చేయడానికి ముందుకు రావడం కష్టమే. ఇక అలాంటి దర్శకుడితో తమ హీరో సినిమా చేస్తున్నాడంటే అభిమానులు ఊరుకోరు. సోషల్ మీడియాలో నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ఉద్యమాలు చేసేస్తుంటారు. ఆ మధ్య మారుతితో ప్రభాస్ సినిమాను అభిమానులు ఎంతగా వ్యతిరేకించారో తెలిసిందే. ఆ దెబ్బకు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించడానికి కూడా టీం భయపడింది.

ఐతే యువ దర్శకుడు సుజీత్‌తో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అనౌన్స్ చేస్తే ఫ్యాన్స్ నుంచి ఏమాత్రం వ్యతిరేకత కనిపించడం లేదు. పెద్దగా అనుభవం లేకపోయినా.. ‘సాహో’తో పెద్ద డిజాస్టర్ ఇచ్చినా సుజీత్‌ను పవన్ ఫ్యాన్స్ నమ్ముతుండడం విశేషమే. ‘సాహో’ అప్పటికి డిజాస్టర్ అయి ఉండొచ్చు కానీ.. కేవలం ఒక చిన్న సినిమా తీసిన అనుభవంతో అంత భారీ ప్రాజెక్టును సుజీత్ బాగానే హ్యాండిల్ చేశాడని చాలామంది నమ్ముతున్నారు.

‘సాహో’ మీద అంచనాలు మరీ ఎక్కువ అయిపోవడం వల్ల.. ఆ సినిమా సంతృప్తిపరచలేకపోయింది కానీ.. అందులో సుజీత్ అండ్ టీం కష్టం కనిపిస్తుంది. అందులో స్టాండౌట్‌గా నిలిచే సీన్లు చాలా ఉన్నాయి. హై టెక్నికల్‌ స్టాండర్డ్స్, యాక్షన్ ఘట్టాలు, స్టైలిష్ టేకింగ్‌తో సుజీత్ మెప్పించాడు. కథనం మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే ‘సాహో’ వేరే లెవెల్ సినిమా అయ్యేదే. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో సుజీత్ బాగా ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. మూడేళ్ల పాటు అతడికి సినిమా లేదు. అయినా సరే నిరాశ చెందకుండా చాలా కసిగా పని చేసి పవన్ కోసం స్క్రిప్టు రెడీ చేశాడు.

ఈ స్క్రిప్టు పవన్‌ను తెగ నచ్చేసి.. సుజీత్‌ను లంచ్‌కు పిలిచి గౌరవించినట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. పవన్‌తో చేయబోయే సినిమాకు సంబంధించి ప్రి లుక్ పోస్టర్ ద్వారా సుజీత్ బాగానే క్యూరియాసిటీ రేకెత్తించగలిగాడు. పవన్ ఫ్యాన్స్ ఈ పోస్టర్ విషయంలో చాలా పాజిటివ్‌గా స్పందిచారు. ఓవరాల్‌గా ఈ ప్రాజెక్టు విషయంలోనూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘సాహో’ తర్వాత సుజీత్ కసిగా పని చేసి సత్తా చూపిస్తాడని, పవన్‌ను నెవర్ బిఫోర్ అన్న రీతిలో ప్రెజెంట్ చేస్తాడని వారు నమ్ముతున్నట్లు కనిపిస్తోంది.

This post was last modified on December 4, 2022 2:34 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

6 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

7 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

7 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

7 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

8 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

8 hours ago