పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి ఇంకా చాలా రోజుల సమయం ఉంది కానీ ఫాన్స్ మాత్రం ఆల్రెడీ బర్త్ డే ట్రెండ్స్ మొదలు పెట్టి ట్వీట్ రికార్డులు సాధిస్తున్నారు. పవన్ ప్రతి పుట్టినరోజుకీ అత్యధిక ట్వీట్స్ వేసిన రికార్డుని ఫాన్స్ సవరిస్తూ ఉంటారు. ఈసారి కూడా ఫాన్స్ అదే పనిలో ఉన్నారు… అయితే వాళ్ళ ఉత్సాహం చూసి రామ్ గోపాల్ వర్మకు వేరే ఆలోచనలు వస్తున్నాయి.
పవర్ స్టార్ సినిమాను పవన్ పుట్టినరోజు కానుకగా విడుదల చేస్తే ఎలాగుంటుందని ఆలోచిస్తున్నాడు. షూటింగ్ ఈ మధ్యే మొదలు పెట్టాడు కనుక అంత త్వరగా పూర్తవుతుందా అనే అనుమానం రావచ్చు. కానీ వర్మ ఇటీవల తీస్తున్న సినిమాలు చూస్తే అంత ఎక్కువ సమయం ఏమీ అవసరం పడదు.
పవన్ పుట్టినరోజుకి ఈ సినిమా విడుదల చేస్తే అదనపు పబ్లిసిటీ వస్తుంది కనుక వర్మ ఆ అవకాశం వదులుకోకపోవచ్చు. తానూ తీసిన సాఫ్ట్ పోర్న్ సినిమాలను ఎక్కువమంది వీక్షించలేదు కానీ… పవన్ క్రేజ్ వల్ల దీన్ని చూస్తారని వర్మ నమ్ముతున్నాడు. మరో నెలన్నర రోజుల వ్యవధి ఉంది కనుక రిలీజ్ గురించి డిసైడ్ అవడానికి వర్మకి సరిపడా సమయమే ఉంది మరి.
Gulte Telugu Telugu Political and Movie News Updates