నవంబరు నెలలో చాలా వరకు డల్లుగా సాగిన టాలీవుడ్ బాక్సాఫీస్‌లో మళ్లీ ఎట్టకేలకు కళ వచ్చింది. గత ఏడాది డిసెంబరు తొలి వారంలో ‘అఖండ’ అదరగొడితే.. ఈ ఏడాది ఆ స్థాయిలో కాకపోయినా ‘హిట్-2’ బాగానే సందడి చేస్తోంది. అడివి శేష్-శైలేష్ కొలను-నాని.. ఈ కాంబినేషన్ ప్రేక్షకులను థియేటర్ల వైపు బాగానే ఆకర్షిస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో.. అటు ఓవర్సీస్‌లో ‘హిట్-2’ తొలి రోజు హౌస్ ఫుల్స్‌తో రన్ అయింది. సినిమాకు మంచి టాక్ రావడంతో మార్నింగ్ షోలు, మ్యాట్నీలతో పోలిస్తే సాయంత్రానికి వసూళ్లు మరింత మెరుగ్గా కనిపించాయి. ప్యాక్డ్ హౌసెస్‌తో నడిచింది సినిమా.
శని, ఆదివారాల్లో కూడా ‘హిట్-2’ అదరగొట్టేలా ఉంది. మొత్తానికి సినిమాకు నెగెటివ్ రిజల్ట్ అయితే లేనట్లే. ‘హిట్-2’ హిట్ అన్న క్లారిటీ వచ్చేసినట్లే. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయితే దర్శక నిర్మాతలకు ఎంత క్రెడిట్ వస్తుందో.. హీరో అడివి శేష్‌కు కూడా అంతే క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇంతకుముందు శైలేష్ కొలను తీసిన ‘హిట్-1’ అంతిమంగా సక్సెస్ ఫుల్ సినిమా అనిపించుకుంది కానీ.. దానికి వసూళ్లు ఓ మోస్తరుగానే వచ్చాయి. కానీ దాంతో పోలిస్తే ‘హిట్-2’ మూణ్నాలుగు రెట్లు ఎక్కువ బిజినెస్ చేసింది. రెవెన్యూ కూడా అదే స్థాయిలో వచ్చేలా ఉంది. సినిమా ఈ రేంజికి వెళ్తోందంటే ‘హిట్’ ఫ్రాంఛైజీకి ఉన్న గుడ్‌విల్‌కు తోడు అడివి శేష్ ముఖ్య కారణం. ‘క్షణం’ నుంచి హీరోగా అతను వరుసగా హిట్లు ఇస్తూనే ఉన్నాడు. శేష్ సినిమా అంటే ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందని థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య సినిమా సినిమాకూ పెరుగుతూ వస్తోంది. ‘హిట్-2’తో అది పీక్స్‌కు చేరేలా ఉంది.
విశేషం ఏంటంటే శేష్‌కు సోలో హీరోగా ఇది వరుసగా ఐదో హిట్టు కావడం విశేషం. ‘క్షణం’తో తొలిసారి హీరోగా సూపర్ హిట్ కొట్టిన శేష్.. ఆ తర్వాత ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’ సినిమాలతో మంచి సక్సెస్‌లు అందుకున్నాడు. ఇప్పుడు ‘హిట్-2’ అతడి వరుసగా అయిదో సూపర్ హిట్ అందించేలా ఉంది. టాలీవుడ్లో పెద్ద పెద్ద హీరోలకు కూడా వరుసగా అయిదు హిట్లు వచ్చిన సందర్బాలు అరుదు. ఇదే ఊపులో ఇంకో హిట్ కొడితే వరుసగా అరడజను సక్సెస్‌లు ఇచ్చిన అరుదైన హీరోల జాబితాలో శేష్ చేరుతాడు.
This post was last modified on December 3, 2022 3:06 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…