కరోనా విపత్తు వల్ల చాలా పరిశ్రమలకు కోలుకోలేని నష్టం జరిగింది. ఇందులో సినీ పరిశ్రమకు జరిగిన, జరుగుతోన్న నష్టం వర్ణనాతీతం. హాలీవుడ్, బాలీవుడ్, ఆ వుడ్డు, ఈ వుడ్డు అని లేకుండా అన్ని ఉడ్డులూ కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. ఈ నష్టాన్ని తట్టుకుని మళ్ళీ కరోనా మునుపటి స్థితికి చిత్ర పరిశ్రమ చేరుకోవాలంటే కనీసం మూడేళ్లు పడుతుందని అంటున్నారు.
మార్కెట్ పరంగా చాలా మార్పు చేర్పులు వచ్చేస్తాయి కనుక ఖర్చు తగ్గించుకోక తప్పదు. ఈ క్రమంలో హీరోలు పారితోషికం తగ్గించుకుని తీరాల్సిందే. తెలుగు హీరోలెవరూ స్వచ్చంధంగా పారితోషికం తగ్గించుకుంటున్నట్టు చెప్పలేదింకా. బహుశా షూటింగ్ మొదలు పెట్టుకోవచ్చు అన్నప్పుడు మరోసారి లెక్కలు వేసుకుని డిసైడ్ అవుతారేమో.
అయితే తమిళ సూపర్ స్టార్ విజయ్ మాత్రం ఆల్రెడీ తన తదుపరి చిత్రానికి ఇరవై శాతం డిస్కౌంట్ ఇచ్చాడట. విజయ్ పారితోషికం అతి భారీ కనుక నిర్మాతకు ఇది చాలా పెద్ద ఉపశమనమే. అయితే ఇరవై శాతం తగ్గింపు సరిపోతుందా లేక మరింత తగ్గించుకోవాలా అనేది ముందు ముందు తెలుస్తుంది.
This post was last modified on July 15, 2020 11:14 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…