వావ్ … ప్రభాస్ వస్తే పండగే

టీవీ ఛానల్స్ లో ఓటిటిలలో ఎన్ని టాక్ షోలు వచ్చినా ఎవరూ ఉహించని విధంగా అన్ స్టాపబుల్ ని బ్లాక్ బస్టర్ చేసిన బాలకృష్ణ ప్రస్తుతం సెకండ్ సీజన్ ని కూడా అదే ఉత్సాహంతో నడిపిస్తున్నారు. కాకపోతే కొంచెం పొలిటికల్ ఫ్లేవర్ ఎక్కువవుతోందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడు, లోకేష్, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు పాల్గొనడం వల్ల రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్లకు తప్పించి ఎంటర్ టైన్మెంట్ లవర్స్ కి ఇవి అంతగా కిక్ ఇవ్వవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదంతా ఆహా టీమ్ కి తెలియంది కాదు. అందుకే ఒక పెద్ద స్కెచ్ వేసినట్టు సమాచారం.

అతి త్వరలో డార్లింగ్ ప్రభాస్ ని ఈ షోకు తీసుకొచ్చే ప్రయత్నాలు అల్లు అరవింద్ తీవ్రం తీసినట్టు ఇన్ సైడ్ టాక్. చలాకీగా జోవియల్ గా మాట్లాడే బాలయ్య ముందు సిగ్గరి ప్రభాస్ అంత ఓపెన్ గా మాట్లాడగలడానే ఆసక్తి కలగడం సహజం. గతంలో మహేష్ బాబు ఎపిసోడ్ ఎలా పేలిందో అందరికీ గుర్తే. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, సిద్దు, శర్వానంద్ లాంటి హీరోలను బాలకృష్ణ డీల్ చేసిన తీరు వ్యూవర్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. కాబట్టి ప్రభాస్ వచ్చినా ఇబ్బంది లేదు. ఈజీగా కలిపేసుకుంటాడు. కాకపోతే బాహుబలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అనేది కొద్దిరోజులు ఆగితే తెలుస్తుంది.

రాజాలో వెంకటేష్ అన్నట్టు బీడీ లేనిదే పొగరాదుగా. సోర్స్ లేనిదే ఇలాంటి వార్తలు చక్కర్లు కొట్టవు. ఒకవేళ నిజంగా వస్తే మాత్రం డార్లింగ్ పెళ్లి వ్యవహారం, పెదనాన్న కృష్ణంరాజుతో అనుబంధం, ఫుడ్ విషయంలో తను ఇచ్చే ఆతిధ్యం, ఇటీవలి డిజాస్టర్లు, రాబోయే ఆది పురుష్ సలార్ విశేషాలు ఇలా బోలెడు షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రభాస్ తన సినిమాలకు సంబంధించి బయట ప్రైవేట్ ఈవెంట్లలో కనిపించింది తక్కువ. ఇప్పుడు ఈ రూపంలో వస్తే మాత్రం బాలయ్య డార్లింగ్ ఇద్దరి అభిమానులకు పండగే. ఇంకో రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన క్లారిటీ రావొచ్చు