తెలుగు ప్రేక్షకులందు యుఎస్‌లో ఉండే ఎన్నారై తెలుగు ప్రేక్షకులు వేరు. అక్కడ కూడా స్టార్ హీరోలను చూసి, కాంబినేషన్ క్రేజ్ చూసి సినిమాలకు వెళ్లేవాళ్లు ఉంటారు కానీ.. వాళ్లతో పోలిస్తే కంటెంట్ చూసి థియేటర్లకు కదిలేవాళ్లు ఎక్కువ. స్టార్ ఇమేజ్ గురించి పట్టించుకోకుండా తమ అభిరుచికి తగ్గ సినిమా అందిస్తే మిలియన్ డాలర్ల వసూళ్లు ఇవ్వడానికి వాళ్లేమీ వెనుకాడరు. ఇప్పటికీ కొందరు పెద్ద స్టార్లకు మిలియన్ డాలర్ మార్కు అనేది పెద్ద టాస్క్‌గా ఉండగా.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు కూడా కొన్ని అలవోకగా ఆ మార్కును అందుకుంటుంటాయి.
మాస్ మసాలా సినిమాల కంటే క్లాస్ టచ్ ఉన్న ప్రేమకథలు, థ్రిల్లర్లకు అక్కడి ప్రేక్షకులు ప్రయారిటీ ఇస్తుంటారు. అందువల్లే నాని, విజయ్ దేవరకొండ, అడివి శేష్ లాంటి యంగ్ హీరోల సినిమాలకు యుఎస్‌లో మంచి వసూళ్లు వస్తుంటాయి. వీరిలో శేష్.. సినిమా సినిమాకూ తన ఇమేజ్‌ను, మార్కెట్‌ను విస్తరిస్తూ పోతున్నాడు.
క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్.. ఇలా శేష్ సినిమాలన్నీ యుఎస్‌లో చాలా బాగా ఆడాయి. కానీ ఇంకా అతను అక్కడ మిలియన్ డాలర్ మార్కును మాత్రం అందుకోలేదు. కానీ ‘హిట్-2’తో శేష్ ఆ క్లబ్బులో అడుగు పెట్టడం పక్కా అన్న అంచనాలు ట్రేడ్ వర్గాల్లో ఉన్నాయి. యుఎఃస్ ప్రేక్షకులను ఈ సినిమా ప్రోమోలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రిమియర్స్ కోసం వాళ్లు చూపిస్తున్న ఆసక్తే ఇందుకు నిదర్శనం.
ప్రిమియర్స్ రోజు ఉదయానికే ‘హిట్-2’ ప్రి సేల్స్ 1.5 లక్షల డాలర్లు చేరువగా ఉన్నాయి. ప్రిమియర్స్ పూర్తయ్యేసరికి వసూళ్లు 2 లక్షల డాలర్ల మార్కును దాటడం ఖాయం. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే.. వీకెండ్లోనే ఈజీగా హాఫ్ మిలియన్ మార్కును టచ్ చేసేస్తుంది హిట్-2. వచ్చే వారం చెప్పుకోదగ్గ రిలీజ్‌లు లేవు కాబట్టి.. డిసెంబరు 15న ‘అవతార్-2’కు ప్రిమియర్స్ పడే వరకు శేష్ సినిమా హవా కొనసాగడం ఖాయం. కాబట్టి ఈసారి శేష్‌కు మిలియన్ డాలర్ల మార్కును అందుకోవడం తేలికే అన్నది ట్రేడ్ టాక్.
This post was last modified on December 1, 2022 5:15 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…