నిఖిల్ పేజీలు ఇంకా రాస్తున్నారు

నిఖిల్ , అనుపమ జంటగా గీతా ఆర్ట్స్ 2 , సుకుమార్ రైటింగ్ నిర్మిస్తున్న ’18 పేజేస్’ డిసెంబర్ 23న థియేటర్స్ లోకి రాబోతుంది. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కి సిద్దమైంది. ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి ఇంకా ఇరవై రోజులే మిగిలుంది. కానీ యూనిట్ ఇంకా పేజీలు రాస్తూ షూటింగ్ చేస్తూనే ఉన్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో నైట్ షూట్ షూటింగ్ జరుగుతుంది. యూనిట్ ఇది ప్యాచ్ వర్క్ అని చెప్తున్నా ఇన్సైడ్ సమాచారం మేరకు రీ షూట్ చేస్తున్నారని తెలుస్తుంది. కార్తికేయ 2 కి ముందే ఈ సినిమా షూట్ ఫినిష్ అయ్యింది. ఆ సినిమా రిలీజ్ తర్వాత నిఖిల్ మళ్ళీ కొన్ని డేట్స్ ఇచ్చాడు. దీంతో యూనిట్ రీ షూట్ మొదలు పెట్టారు.

నిజానికి అల్లు అరవింద్ , సుకుమార్ , బన్నీ వాస్ ముగ్గురు ఈ సినిమా వెనుక ఉన్నారు. దర్శకుడు సూర్య ప్రతాప్ తీసిన కొన్ని సీన్స్ ఈ ముగ్గురికి నచ్చలేదని అందుకే ప్రతాప్ మళ్ళీ వారిని మెప్పించేలా రీ చేస్తున్నాడని అంటున్నారు. రిలీజ్ కి ఇంకా ఇరవై రోజులే ఉంటే టీం మాత్రం ఇంకా షూటింగ్ లో బిజీ గా ఉండటం డిస్ట్రిబ్యూటర్ ని భయ పెడుతుంది. లాస్ట్ మినట్ ఇష్యూస్ ఏమైనా రావొచ్చేమో అని వారు ఖంగారు పడుతున్నారు. తీస్తున్న షూట్ కి ఎప్పటికప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ జరిగితే పర్లేదు కానీ లేదంటే ఫస్ట్ సెన్సార్ ప్రాబ్లం తో పాటు ఇంకొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.