మొన్న వాల్తేర్ వీరయ్య ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో వేర్ ఈజ్ ది పార్టీ అంటూ వీడియోలు ఆడియోలు హోరెత్తిపోయాయి. ప్రోమో టైంలో వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని దేవిశ్రీ ప్రసాద్ తనదైన మాస్ స్టైల్ లో దూదిపింజెలా ఎగరగొట్టేశాడు. ఇప్పుడు బాలయ్య వంతు వచ్చింది. వీరసింహారెడ్డికి తమన్ ఎలాంటి పాటలు ఇచ్చి ఉంటాడోనన్న అంచనాలు అభిమానుల్లో విపరీతంగా ఉన్నాయి. అందులోనూ అఖండ లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఆల్బమ్ కావడంతో హైప్ మాములుగా లేదు. దానికి తగ్గట్టే మొదటి పాట జై బాలయ్య వచ్చేసింది.
ఫ్యాన్స్ కోరుకున్నట్టే తమన్ డీసెంట్ ట్యూన్ తో జై బాలయ్యని కంపోజ్ చేశాడు. కరీముల్లా గాత్రం మంచి డెప్త్ ని తీసుకొచ్చింది. రాజసం నీ ఇంటి పేరు పౌరుషం నీ ఒంటి తీరు అంటూ రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన సాహిత్యానికి హుషారొచ్చేలా సాగే ట్యూన్ మెల్లగా ఎక్కేలా ఉంది. కొంత ఒసేయ్ రాములమ్మ సౌండ్ లా అనిపించినప్పటికీ తమన్ వాడిన ఇన్స్ ట్రుమెంటేషన్స్ రిచ్ గా ఉన్నాయి. జై బాలయ్య నినాదాన్ని పాటగా మార్చాలంటే అదంత సులభం కాదు. పైగా అఖండలో డ్యూయెట్ కోసం వాడిన జై బాలయ్య పదాలు ఇంకా మైండ్ లో ఫ్రెష్ గా ఉండగానే డిఫరెంట్ గా ఇవ్వడం సవాలే.
ఏదైతేనేం మొత్తానికి తమన్ కూడా పాస్ అయ్యాడు. వేరీజ్ ది పార్టీతో దీన్ని పోల్చడానికి లేదు. చిరంజీవిది ఐటెం సాంగ్. బాలకృష్ణది క్యారెక్టరైజేషన్ గీతం. ఒకవేళ రెండూ ఒక తరహా అయ్యుంటే అప్పుడు ఏది బెటరనే చర్చ వచ్చి ఉండేది కానీ విడిగా వింటే మాత్రం అటు దేవిశ్రీ ప్రసాద్, ఇటు తమన్ ఇద్దరూ మైత్రి మేకర్స్ మీదున్న మొదటి బరువును తగ్గించేశారు. చాలా తక్కువ గ్యాప్ లో బ్యాలన్స్ గా ప్రమోషన్లు చేయాల్సి రావడం మహా కష్టంగా మారిపోయింది. సంక్రాంతికి రావడం పక్కానే అయినా ఎవరు ముందు ఎవరు వెనుకనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. త్వరలోనే ప్రకటనలుంటాయి.