స‌స్పెన్సుకు తెర‌.. ఓటీటీలోకి కాంతార‌

కాంతార అనే చిన్న కన్నడ సినిమా గ‌త 50 రోజుల నుంచి రేపుతున్న సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే. సెప్టెంబరు నెలాఖర్లో కన్నడలో ఓ మోస్తరు అంచనాలతో విడుదలైందీ సినిమా. ముందు కన్నడ ప్రేక్షకులు ఈ చిత్రం పట్ల అమితాసక్తిని ప్రదర్శించారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో కన్నడ వెర్షన్ చూడడానికే వేరే భాషల చిత్రాలు ఎగబడ్డారు. ఇది చూసి రెండు వారాల తర్వాత తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లోనూ అనువాదం చేసి రిలీజ్ చేశారు. ఇక అప్పుడు మొదలైంది అసలు మోత.

తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, మ‌ల‌యాళ ప్రేక్ష‌కులు ఈ సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. తెలుగు వెర్ష‌న్ మాత్ర‌మే రూ.60 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసింది. హిందీలో వ‌సూళ్లు వంద కోట్లు దాటిపోయాయి. మొత్తంగా కాంతార వ‌సూళ్లు ఇటీవ‌లే రూ.400 కోట్ల మార్కును దాటిపోయాయి. ఇప్ప‌టికీ ఈ సినిమా చెప్పుకోద‌గ్గ వ‌సూళ్లే సాధిస్తోంది.

ఐతే ముందుగా చేసుకున్న డీల్ ప్ర‌కారం రిలీజ్ త‌ర్వాత 50 రోజుల‌కు కాంతార సినిమాను ఓటీటీలోకి వ‌దిలేస్తున్నారు. అమేజాన్ ప్రైమ్ సంస్థ బుధ‌వారం అర్ధ‌రాత్రి నుంచే ఈ చిత్రాన్ని స్ట్రీమ్ చేస్తోంది. కాంతార చిత్రాన్ని చాలామంది థియేట‌ర్ల‌లో చూడ‌డానికే ఇష్ట‌ప‌డ్డ‌ప్ప‌టికీ.. ఓటీటీలో చూసేందుకు ఎదురు చూస్తున్న వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. సినిమా థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు మూడు వారాల నుంచే డిజిట‌ల్ రిలీజ్ కోసం వాళ్లు వెయిటింగ్‌లో ఉన్నారు.

ఓటీటీ రిలీజ్ విష‌యంలో ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రిగాయి కానీ.. అవి నిజం కాలేదు. చివ‌రికి థియేట్రిక‌ల్ రిలీజ్ త‌ర్వాత నెల రోజుల‌కు ఓటీటీలో సినిమా వ‌చ్చేస్తోంది. క‌న్న‌డ‌తో పాటు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. మ‌రి ఇక్క‌డ ఆ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో చూడాలి.