Movie News

‘ప్రాజెక్ట్-కే’ కష్టాలపై నాగ్ అశ్విన్

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ చేస్తున్న అత్యంత భారీ, మోస్ట్ యాంబిషియ‌స్ ప్రాజెక్టుల్లో ప్రాజెక్ట్-కె ఒక‌టి. మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ రూ.500 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్లో నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్రి ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కే రెండేళ్లు ప‌ట్టింది. షూటింగ్ కూడా చాలా శ్ర‌మ‌తో కూడుకున్న‌దే.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా భారీగానే ఉండ‌బోతోంది. ఇది హాలీవుడ్ ఎవెంజ‌ర్స్ త‌ర‌హా ఫాంట‌సీ, సైన్స్ ఫిక్ష‌న్ ట‌చ్ ఉన్న సినిమా. విజువ‌ల్ ఎఫెక్స్ట్ ప్ర‌పంచ స్థాయిలోనే ఉండ‌బోతున్నాయి. ఈ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను మ‌రో ప్రపంచంలోకి తీసుకెళ్తామ‌ని.. ఇది పాన్ వ‌ర‌ల్డ్ సినిమా అని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి నాగ్ అశ్విన్ మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఈ సినిమా కోసం తాము ప‌డుతున్న క‌ష్టాన్ని వివ‌రించాడు.

ప్రాజెక్ట్-కె సినిమా కొత్త‌ద‌ని.. అలాగే స్క్రిప్టు కూడా చాలా విభిన్నంగా ఉంటుంద‌ని, ఈ సినిమాకు అన్నీ సిద్ధం చేస్తున్న టెక్నీషియ‌న్లు కూడా కొత్త వాళ్లే అని నాగ్ అశ్విన్ తెలిపాడు. ఒక ర‌కంగా ఈ సినిమా ఎలా చేయాలి అనేది ఆలోచించ‌డానికే చాలా స‌మ‌యం ప‌డుతోంద‌ని అత‌ను చెప్పాడు. సినిమాకు సంబంధించి ఏదీ రెడీ మేడ్‌గా దొర‌క‌ద‌ని.. ప్ర‌తిదీ సున్నా నుంచి రెడీ చేసుకుంటున్నామ‌ని నాగ్ అశ్విన్ వెల్ల‌డించాడు.

మ‌హాన‌టి సినిమా కోసం వింటేజ్ కార్లు కావాలంటే ఎక్క‌డో ఓ చోట వెతికి రెంటుకు తెచ్చుకున్నామ‌ని.. కానీ ప్రాజెక్ట్-కె కోసం ఉప‌యోగిస్తున్న వాహ‌నాలు ఏవీ కూడా ఎక్క‌డా దొర‌క‌వ‌ని.. వాటిని తామే అవ‌స‌ర‌మైన మేర‌కు త‌యారుచేయించుకున్నామ‌ని నాగి తెలిపాడు. ఒక‌టి మాత్రం క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌న‌ని.. ఈ సినిమా చాలా కొత్త‌గా ఉంటుంద‌ని, ప్రేక్ష‌కుల‌ను మ‌రో లోకంలోకి తీసుకెళ్తుంద‌ని నాగ్ అశ్విన్ చెప్పాడు.

This post was last modified on November 21, 2022 6:54 am

Share

Recent Posts

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

22 minutes ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

50 minutes ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

1 hour ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

2 hours ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

6 hours ago