Movie News

సమంత కూడా బీట్ చేయలేకపోయింది

చాలారోజుల నుండి తెలుగు బాక్సాఫీస్ దగ్గర చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయ్ కాని, ఎంతమంచి టాక్ వచ్చినా కూడా.. బాక్సాఫీస్ దగ్గర భారీ కలక్షన్లను రాబట్టడంలో విఫలమవుతున్నాయ్. ముఖ్యంగా ”కాంతారా” అనే డబ్బింగ్ సినిమా తెలుగు బాక్సాఫీస్ దగ్గర్ 40 కోట్ల వసూళ్లు రాబట్టిన సందర్బంలో, అసలు మరేదైనా తెలుగు సినిమా దీన్ని బీట్ చేస్తుందా అంటూ అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పెద్ద స్టార్ సినిమాలొస్తే ఎలాగో కాంతారా కలక్షన్లను క్రాస్ చేయడం పెద్ద విషయంకాదులే కాని, కాంతారా టైపులో మరో చిన్న తెలుగు సినిమా కొడితేనే కిక్కుంటుంది.

కాంతారా రిలీజ్ అయిన తరువాత.. తెలుగులో రిలీజైన చిన్న సినిమాలను చూసుకుంటే.. మంచు విష్ణు జిన్నా, విశ్వక్సేన్ ఓరి దేవుడా అలాగే కార్తి సర్దార్ సినిమాలు రిలీజ్ అయ్యాయ్. ఆ తరువాత సంతోష్‌ శోభన్ లైక్ షేర్ సబ్‌స్ర్కైబ్, అల్లు శిరీష్‌ ఊర్వశివో రాక్షసివో కూడా వచ్చాయ్. కాని వీటిలో పాజిటివ్ టాక్ వచ్చిన ఓరి దేవుడా, లైక్ షేర్ సబ్‌స్ర్కైబ్ సినిమాలు కూడా కలక్షన్ల విషయంలో చతికిలపడ్డాయ్. ఆ టైములో సమంత ‘యశోద’ సినిమా వస్తే కాంతారా సినిమా కలక్షన్లను బీట్ చేస్తుందని అందరూ ఆశించారు. ట్రేడ్ వర్గాలు కూడా అదే హోప్‌తో ఉన్నాయ్. కాని చూస్తుంటే కాంతారా ను బీట్ చేయడం సమంతకు కూడా కుదిరేపని కాదని తెలుస్తోంది.

మొదటి వీకెండ్లో ఓ 8 కోట్ల షేర్ రాబట్టిన యశోద.. వీక్ మధ్యలో బాగా వీక్ అయ్యింది. ఇప్పటివరకు మొత్తంగా 10 కోట్ల షేర్ వచ్చింది అంతే. ఒకవేళ ఈ వీకెండ్‌లో వేరే సినిమాల తాకిడి పెద్దగా లేదు కాబట్టి, యశోద సినిమా కాస్త పుంజుకున్నా కూడా.. కాంతారా తరహాలో ఓ 25 కోట్ల షేర్ వసూళ్లు సాధించడం కష్టమే. ఇప్పటికీ కొన్ని సెంటర్లలో కాంతారా సినిమా హౌస్‌ఫుల్స్‌తో నడవడమే ఇందుకు కారణం. మరి సమంత చేయలేని పని తదుపరి ఎవరన్నా చిన్న హీరోలు చేస్తారో లేదో వేచి చూడాలి.

This post was last modified on November 17, 2022 11:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

54 minutes ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

1 hour ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

2 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

3 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

4 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

5 hours ago