పవన్ కళ్యాణ్ సినిమాలు లేటవుతుంటే ఆయన ఫ్యాన్స్ ఎంత అప్సెట్ అవుతున్నారో తెలియదు కాని, ఆయన సినిమాలను నమ్ముకున్న కొంతమంది సెలబ్రిటీలు మాత్రం బాగా అప్సెట్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ చాలా సినిమాలు చేస్తానని కమిట్మెంట్ ఇచ్చేసిన జనసేనాని, చివరకు క్రిష్ సినిమా ఒక్కటే పూర్తి చేసేలా కనిపిస్తున్నాడు. ఒకవేళ అదే జరిగితే మాత్రం.. పవన్‌ను మాత్రమే నమ్ముకున్న కొంతమంది హీరోలు డైరక్టర్లూ బాగా డిజప్పాయింట్ అయిపోయినట్లే.
సాహో సినిమాతో ఇండియావైడ్ పాపురల్ అయ్యాడు డైరక్టర్ సుజిత్ రెడ్డి. ఆల్రెడీ రన్ రాజా రన్ తరువాత వెంటనే సినిమా చేయకుండా.. ప్రభాస్ కోసం ఏకంగా కొన్ని సంవత్సరాలపాటు వెయిట్ చేశాడు. చివరకు చాలా స్టయిలిష్‌గా సాహో సినిమాను తీసినా కూడా.. ఆ సినిమా తేడపడటంతో సుజిత్ షాక్ అయ్యాడు. కాని వెంటనే మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమాను డైరక్ట్ చేసే ఛాన్స్ రావడంతో ఆనందపడ్డాడు. బట్ చివర్లో తమిళ డైరక్టర్ మోహన్ రాజాను ఈ రీమేక్ కోసం ఎంచుకుని మెగాస్టార్ సుజిత్‌కు పెద్ద షాకే ఇచ్చారు.
ఆ తరువాత మనోడు పూర్తి టాలెంట్ వాడేసి పవన్ కళ్యాన్‌ను ఇంప్రెస్ చేస్తే.. ఇప్పుడేమో సినిమా 2024 వరకు టేకాఫ్ అవ్వదని క్లారిటీ వచ్చేసరికి ఇంకా షాకైపోతున్నాడట. మరి వేరే హీరోతే ఏదైనా సినిమా చేస్తాడా లేదంటే ప్రభాస్ కోసం ఎదురు చూసినట్లు పవన్ కళ్యాణ్ కోసం కూడా వెయిట్ చేస్తాడా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ అలా వెయిట్ చేస్తే మాత్రం.. స్టార్ హీరోల కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేసే డైరక్టర్‌గా చరిత్రకెక్కుతాడు ఈ కుర్ర డైరక్టర్.
ఇకపోతే తనకు యాక్సిడెంట్ అయిన తరువాత ఎటువంటి సినిమాతో ముందుకొస్తే బాగుంటుందోనని మెగా హీరో సాయిధరమ్ తేజ్ చాలానే కష్టపడ్డాడు. చివరకు ఓ రెండు సినిమాలు ఓకె అయినా కూడా.. పవన్ కళ్యాణ్‌తో కలసి చేసే వినోదాయసితం రీమేక్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. సితార సంస్థ మరియు త్రివిక్రమ్ వైఫ్ ప్రొడ్యూస్ చేయాల్సిన ఈ సినిమాకు పవన్ డేట్స్ ఇచ్చేలా లేడని టాక్ నడుస్తుండగా.. ఈ సినిమాను 2024లో టేకాఫ్ చేద్దామని పవన్ చెప్పడంతో మేనల్లుడు తేజు కూడా బాగా హర్ట్ అయిపోయాడట.
This post was last modified on November 15, 2022 12:06 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…