Movie News

హీరోయిన్ల పెళ్లిళ్లు ఫర్ సేల్

ఓటిటిల మధ్య పోటీ ఎక్కువైపోయి ఎలాంటి కంటెంట్ తో ఆడియన్స్ ని నిలబెట్టుకోగలమో ఆలోచిస్తూ దానికి ఏమేం చేయాలో, ఎంత క్రియేటివ్ గా ఆలోచించాలో సదరు డిజిటల్ కంపెనీలు అన్నీ చేస్తున్నాయి. తక్కువ గ్యాప్ లో కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. కోట్ల రూపాయల బడ్జెట్ తో వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయి. డాక్యుమెంటరీలను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తీస్తున్నాయి. స్పోర్ట్స్ ఫ్యాన్స్ ని మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఐసిసితో టై అప్ చేసుకుని క్రికెట్ మ్యాచులను లైవ్ ఇస్తున్నాయి. టాక్ షోలు, ఇంటర్వ్యూలు, డాన్స్ ప్రోగ్రాంలు, వంటలు ఒకటా రెండా అన్నీ చేస్తున్నాయి.

ఇప్పుడు కొత్తగా సెలబ్రిటీ వెడ్డింగ్స్ ని లక్ష్యంగా మార్చుకుంటున్నాయి. నయనతార విఘ్నేష్ శివన్ ల వివాహ వేడుకను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం చెల్లించి హక్కులు కొనుగోలు చేసిందన్న వార్త ఓ సెన్సేషన్ గా నిలవడం అందరికీ గుర్తే. అదింకా రిలీజ్ చేయలేదు కానీ వేడుకకు సంబంధించిన ఫోటోలు ముందే సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల అగ్రిమెంట్ ఉల్లంఘించారనే దాని మీదే ఏదో వివాదం నడుస్తోందన్నారు కానీ అది నిజమో కాదో కన్ఫర్మేషన్ లేదు. ఆ వీడియోని డైరెక్ట్ చేసిన గౌతమ్ మీనన్ కూడా వివరాలు చెప్పలేదు. ఇప్పుడు ఈ లిస్టులో హన్సిక మొత్వానిని చేర్చబోతున్నారు

హన్సిక త్వరలో స్నేహితురాలి మాజీ భర్త, తన ప్రియుడు సోహైల్ కతూరియాతో మూడు ముళ్ళు వేయించుకోబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 3, 4 తేదీల్లో జరగబోయే ఈ పెళ్లిని ఓ ప్రముఖ ఓటిటి భారీ రేట్ ఇచ్చి రైట్స్ కొనుక్కుందట. హన్సికకు అంత క్రేజ్ ఉందా అనుకోకోకండి. ఒకదశలో ఆమెకు తమిళనాడులో గుడి కట్టే రేంజ్ లో అభిమానులున్నారు. అందుకే ఖచ్చితంగా వ్యూస్ భారీగా వస్తాయనే ఉద్దేశంతో ఇలా సెట్ చేశారన్న మాట. ఇంకా అఫీషియల్ అయితే కాలేదు. ఇంకా పెళ్లి కాని, చేసుకోబోయే టాప్ హీరోయిన్లు బోలెడున్నారు. ఇలా అందరూ ఇదే దారి పడితే ఇదో ట్రెండ్ గా మారినా ఆశ్చర్యం లేదు

This post was last modified on November 14, 2022 9:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago