సూపర్ స్టార్ కృష్ణ అనారాగ్యంతో ఆసుపత్రిలో చేరడం ఆయన అభిమానులను కొంత కంగారు పెడుతోంది. హైదరాబాద్‌లోకి కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. ఈ వార్త కొంచెం ఆలస్యంగా సోషల్ మీడియాకు, మీడియాకు తెలిసింది. కానీ విషయం తెలియగానే ఆ వార్త సామాజిక మాధ్యమాల్లో విస్తృతం అయిపోయింది. కొంచెం తీవ్ర సమస్యతోనే కృష్ణ ఆసుపత్రిలో చేరినట్లుగా చర్చించుకున్నారు. దీంతో సూపర్ స్టార్ అభిమానులకు టెన్షన్ తప్పలేదు.
ఐతే వారు కంగారు పడకుండా కృష్ణ కుటుంబం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణ రెగులర్ చెకప్‌లో భాగంగానే ఆసుపత్రిలో చేరారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. కానీ వాస్తవానికి కృష్ణ కొన్ని నెలల నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. రెండు వారాల కిందటే ఆయన కొంచెం తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు వైద్యులు ఇంటికే వచ్చి చికిత్స చేశారు. ఇప్పుడు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం వచ్చింది.
కొన్నేళ్ల ముందు వరకు హుషారుగానే ఉన్న కృష్ణ.. భార్య విజయనిర్మల దూరం అయ్యాక డల్ అయిపోయారు. కొంత కాలంగా ఆయన బయట ఎక్కడా కనిపించడం లేదు. ఇటీవల తన మొదటి భార్య, మహేష్ తల్లి ఇందిర చనిపోయినపుడు చివరి చూపుకోసం వచ్చారు. అప్పుడు కూడా డల్‌గానే ఉన్నారు. ప్రస్తుతం తలెత్తిన ఆరోగ్య సమస్య నుంచి కోలుకుని సూపర్ స్టార్ సంపూర్ణ ఆరోగ్యవంతుడవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on November 14, 2022 12:51 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…