ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులే కాక ఇండియన్ సినీ అభిమానులందరూ ఎదురు చూస్తున్న చిత్రాల్లో రామ్ చరణ్-శంకర్ కలయికలో (RC 15) తెరకెక్కుతున్న సినిమా ఒకటి. శంకర్‌కు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫాలోయింగ్ ఉండగా.. ‘ఆర్ఆర్ఆర్’తో చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు కాబట్టి ఈ కాంబినేషన్ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఐతే ‘ఆర్ఆర్ఆర్’ పని పూర్తి కాగానే ఆలస్యం చేయకుండా ఈ సినిమాను చరణ్ పట్టాలెక్కించాడు కానీ.. కొన్ని అడ్డంకులు తప్పట్లేదు.
ఒక దశ వరకు షూటింగ్ జోరుగా సాగినప్పటికీ.. మధ్యలో ‘ఇండియన్-2’ తెరపైకి రావడంతో చరణ్ అటు వైపు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఆయన ఫోకస్ ప్రధానంగా ఆ చిత్రం మీదే ఉంది. మధ్య మధ్యలో చరణ్ సినిమాకు డేట్లు ఇస్తున్నా.. ప్రయారిటీ అయితే ‘ఇండియన్-2’ను త్వరగా పూర్తి చేయడం లాగే ఉంది. దీంతో ఆల్రెడీ చరణ్ సినిమాను 2023 సంక్రాంతి రేసు నుంచి తప్పించారు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం 2023 వేసవిలోనూ రిలీజయ్యే అవకాశాలు లేనట్లే. ఎందుకంటే ఈ సినిమా చిత్రీకరణ ఇంకా 100 రోజుల దాకా జరపాల్సి ఉందట. వంద రోజులకు టీంలో అందరూ డేట్లు కేటాయించాలంటే కనీసం ఇంకో ఏడాది అయినా పడుతుంది. కాబట్టి వచ్చే ఏడాది రెండో అర్ధంలోనే సినిమా పూర్తయ్యే అవకాశముంది.
ఇది పాన్ ఇండియా సినిమా కావడం, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా చాలానే ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్‌కు చాలానే టైం పడుతుంది. కాబట్టి 2023లో సినిమా రిలీజవడం కష్టమే అని చెప్పొచ్చు. కుదిరితే ఆ ఏడాది చివర్లో రిలీజ్ చేయొచ్చు. లేదంటే 2024 సంక్రాంతికి వెళ్లొచ్చు. కాగా త్వరలోనే చరణ్-కియారా అద్వానీల మీద ఒక భారీ పాట చిత్రీకరణ కోసం టీం న్యూజిలాండ్‌కు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ రూ.200 కోట్లకు పైమాటే.
This post was last modified on November 13, 2022 10:15 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…