Movie News

బుచ్చిబాబు ఎదురుచూపులకు బ్రేకెప్పుడు

కాలం చాలా విలువైంది, ఒక్కసారి పోగొట్టుకుంటే దాన్ని మళ్ళీ వెనక్కు తెచ్చుకోలేమనేది పెద్దలు ఎప్పటి నుంచో చెబుతున్నదే. అందరికీ తెలిసిందే. కానీ కొత్త తరం దర్శకులు మాత్రం దాన్ని ఎంత మాత్రం వంటబట్టించుకోవడం లేదు. స్టార్ల ట్రాప్ లో పడి వాళ్ళతో సినిమాలు తీస్తేనే కెరీర్ పరుగులు పెడుతుందనే నమ్మకంతో బంగారం లాంటి సమయాన్ని కర్పూరంలా కరిగించేస్తున్నారు. ఉప్పెన వచ్చి రెండేళ్లు దాటుతోంది.

ఇంకో మూడు నెలలు ఆగితే సెకండ్ యానివర్సరీ సెలెబ్రేషన్స్ చేసుకోవచ్చు. కానీ దర్శకుడు బుచ్చిబాబు కొత్త మూవీ మాత్రం ఇప్పటిదాకా మొదలుకాదు కదా కనీసం ఫైనల్ కాలేదు. ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ దాని తర్వాత రెండు రిలీజ్ చేసుకుని మరో రెండు సెట్ల మీద ఉంచాడు. కృతి శెట్టి ఏకంగా అయిదారు ఫినిష్ చేసి ఇంకో రెండు షూటింగులలో బిజీగా ఉంది. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎన్ని చేసిందో వెంటనే లెక్క చెప్పడం కష్టం.

ఎటు తిరిగి బుచ్చిబాబునే ఇంకా మీమాంసలో కొనసాగుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తో పెద్ది టైటిల్ తో ఏదో ప్రాజెక్టు ఉందనే ప్రచారం జరిగింది. ఇంకా కొరటాల శివదే రెగ్యులర్ షూట్ స్టార్ట్ కాలేదు కాబట్టి ఇదెంత వరకు కన్ఫర్మ్ అవుతుందో చెప్పలేం. మరోవైపు చరణ్ కు స్టోరీ చెప్పాడనే ప్రచారం ఫిలిం నగర్ లో జరుగుతోంది.

అప్పుడప్పుడు గురు సుకుమార్ తో ఏదో స్క్రిప్ట్ డిస్కస్ చేస్తున్న ఫోటోలు అడపాదడపా ట్విట్టర్ స్పేస్ లో ఫ్యాన్స్ తో కలిసి చేస్తున్న చర్చలు మినహాయించి బుచ్చిబాబు నుంచి ఒక స్థిరమైన అడుగు ఏదీ పడలేదు. పోనీ తనైనా ఫలానా హీరోతో చేస్తున్నాననో లేదా లైన్ మీద వర్క్ జరుగుతోందనో చెబితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ తన వైపు నుంచి నో అప్ డేట్. బుచ్చిబాబు లాంటి యంగ్ టాలెంట్స్ రెండో సినిమాకే ఇంత టైంని ఖర్చుపెడితే ఇక కెరీర్ వేగంగా సాగేదెలా .ఒకప్పుడు దాసరి, కోడి రామకృష్ణ లాంటి అగ్ర దర్శకులు వందల సినిమాలు ఎలా చేశారో కానీ ఇప్పటి డైరెక్టర్లు మాత్రం పది చేస్తేనే గొప్పేమో

This post was last modified on November 13, 2022 6:21 pm

Share

Recent Posts

జాన్విని మ‌ళ్లీ చూస్తామా?

బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయ‌డం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేట‌స్ సంపాదించాక‌, తెలుగులో…

5 hours ago

చివరి సినిమా చేదు జ్ఞాపకమే అయ్యింది

గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…

6 hours ago

వైసీపీ నాయకులకు సరైన భరోసా లేదా?

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై కేసులు కొన‌సాగుతున్నాయి. అనేక మంది నాయ‌కుల‌పై కేసులు న‌మోదై... ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఉన్నాయి.…

6 hours ago

‘జగన్ వస్తున్నారా.. అయితే మూతే’

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…

6 hours ago

వైసీపీకి చెక్‌: మండలి వైస్ చైర్మన్‌పై కూటమి కీలక నిర్ణయం!

ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…

6 hours ago

గంజాయి బ్యాచ్ హద్దులు మీరుతుంది

హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…

6 hours ago