Movie News

ఎన్టీఆర్ టైటిల్.. పవన్ ఫ్యాన్స్ హర్టు

జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇదిగో అదిగో అనుకుంటూనే నెలలకు నెలలు గడిచిపోతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ చిత్రం ఆగిపోయినట్లు ఒక దశలో ప్రచారం జరగడం తెలిసిందే. కానీ ఆ ప్రచారాన్ని ఖండిస్తూ ఇటీవలే చిత్ర బృందం అప్‌డేట్ ఇచ్చింది.

ప్రి ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నట్లు సంకేతాలు ఇస్తూ దర్శకుడు కొరటాల శివ.. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్‌లతో చర్చిస్తున్న ఫొటోలు కూడా రిలీజ్ చేశారు. కాబట్టి సినిమా విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన పని లేనట్లే. జనవరిలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లొచ్చనే సంకేతాలు అందుతున్నాయి. కాగా ఆ సినిమా గురించి ఇప్పుడో ఆసక్తికర ప్రచారం మొదలైంది. ఈ చిత్రానికి ‘దేవర’ అనే మాస్ టైటిల్ ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు.

ఈ సమాచారం బయటికి వచ్చినప్పటి నుంచి పవన్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ టైటిల్‌‌తో పవన్ సినిమా చేస్తే బాగుంటుందని వారు కోరుకుంటున్నారు. వాళ్లకు ఆ ఆలోచన పుట్టేలా చేసింది బండ్ల గణేష్. పవన్‌ను తన దేవుడిగా అభివర్ణిస్తూ తరచుగా ‘దేవర’ అనే పదాన్ని వాడుతుంటాడు బండ్ల. అందుకే ఆ పదం వినగానే అభిమానులకు కూడా పవనే గుర్తుకు వస్తున్నాడు. నిజానికి ఈ టైటిల్‌తో పవన్ హీరోగా సినిమా తీయాలని బండ్లకు కూడా ఉంది.

ఆ టైటిల్‌ను ఆయన రిజిస్టర్ కూడా చేయించాడట గతంలో. కానీ దాన్ని రెన్యువల్ చేయకపోవడంతో ఇప్పుడు కొరటాల శివ వాడేస్తున్నట్లుగా చెబుతున్నారు. అసలే పవన్ కళ్యాణ్ సినిమా క్లాసిక్ సినిమాలైన తొలిప్రేమ, ఖుషి టైటిళ్లను వేరే వాళ్లు వాడుకోవడం పట్ల పవర్ స్టార్ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడేమో తమ హీరో సొంతం అనుకున్న టైటిల్‌ను ఇప్పుడు తారక్ చిత్రానికి ఖాయం చేస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారంతో వాళ్లు మరింత డిజప్పాయింట్ అవుతున్నారు.

This post was last modified on November 12, 2022 3:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

5 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

6 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

6 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

7 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

8 hours ago