హోమ్లీ హీరోయిన్.. అస్సలు తగ్గట్లేదుగా!

మీరా జాస్మిన్.. భద్ర సినిమాతో తెలుగు పరిశ్రమలో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత చాలా కాలం పాటు సినిమా ఇండస్ట్రీలో కొనసాగింది. అయితే మీరాజాస్మిన్ ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు గ్లామర్ డోస్ మాత్రం పెద్దగా పెంచింది లేదు. వీలైనంతవరకు ఆమె హోమ్లీ పాత్రలతోనే ఎక్కువగా ఎట్రాక్ట్ చేసింది. మలయాళం లో ఎక్కువగా సినిమాలు చేసినప్పటికీ తెలుగువారికి కొన్ని సినిమాలతోనే చాలా దగ్గరయిపోయింది.

అయితే మీరాజాస్మిన్ పెళ్లి తర్వాత అసలు యాక్టింగ్ చేస్తుందా లేదా అనే అనుమానాలు వచ్చాయి. కానీ ఎప్పటిలానే మలయాళం లో బిజీగా ఉన్న మీరాజాస్మిన్ ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలో కూడా బిజీ అవ్వాలని అనుకుంటుంది. అందుకే ఈ తరహా గ్లామర్ డోస్ తో షాక్ ఇస్తోంది. మీరాజాస్మిన్ అనగానే ప్రేక్షకులలో ఒక హోమ్లి క్యారెక్టర్ అనే భావన ఉంది. మరి ఈ తరహా గ్లామర్ డోర్స్ తో ఆమె ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.