అను ఇమ్మాన్యుయెల్.. ఒక టైంలో టాలీవుడ్లో చాలా గట్టిగా వినిపించిన పేరు ఇది. చిన్న సినిమాలతోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య’, పవన్ కళ్యాణ్‌తో ‘అజ్ఞాతవాసి’ లాంటి భారీ చిత్రాల్లో నటించడంతో ఆమె పేరు మార్మోగింది. కానీ ఆ పెద్ద సినిమాలు పెద్ద డిజాస్టర్లవడంతో ఆమె చూస్తుండగానే కనుమరుగైపోయింది. చివరగా ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ప్రాధాన్యం లేని పాత్రలో కనిపించిన మాయం అయిన అను.. చాన్నాళ్ల తర్వాత ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాతో మళ్లీ మన ప్రేక్షకుల దృష్టిలో పడింది.
కొంచెం బోల్డ్ టచ్ ఉన్నప్పటికీ ధైర్యం చేసి ఈ పాత్రలో నటించడం ఆమెకు కలిసి వచ్చింది. సినిమా మంచి టాకే తెచ్చుకుంది. ఓ మోస్తరు వసూళ్లతో ముందుకు సాగుతోంది.
అను కెరీర్‌కు ‘ఊర్వశివో రాక్షసివో’ ఒక టర్నింగ్ పాయింట్ అయితే ఆశ్చర్యం లేదు. ఈ సినిమాకు ఆమే ప్రధాన ఆకర్షణ. లిప్ లాక్స్, బోల్డ్ యాక్ట్స్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కించిన అనుకు మళ్లీ టాలీవుడ్లో ఆఫర్లు రావచ్చు. ఐతే అంతకంటే ముందు తమిళంలో ఓ పెద్ద సినిమాలో ఛాన్స్ పట్టేసింది అను. అక్కడ స్టార్ హీరోల్లో ఒకడైన కార్తితో ఆమె జట్టు కడుతోంది. అతను హీరోగా ‘జపాన్’ అనే సినిమా మొదలైంది.
ఇంతకుముందు ‘జోకర్’ అనే అవార్డ్ విన్నింగ్ మూవీ తీసిన రాజు మురుగన్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ‘జపాన్’ అనే వెరైటీ టైటిల్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తక్కువ గ్యాప్‌లో ‘పొన్నియన్ సెల్వన్’, ‘సర్దార్’ లాంటి పెద్ద హిట్లు కొట్టిన కార్తి సరసన కథానాయికగా అంటే అనుకు పెద్ద ఛాన్స్ అన్నట్లే. దీంతో పాటు తెలుగులోనూ రెండు మూడు పడ్డాయంటే మళ్లీ ఆమె కెరీర్ ఊపందుకున్నట్లే.
This post was last modified on November 9, 2022 10:22 am
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…