ఖుషీకి అంత బిజినెస్ జరిగిందా

విజయ్ దేవరకొండ సమంతా ఫస్ట్ టైం కాంబోలో రూపొందుతున్న ఖుషి నాన్ థియేట్రికల్ డీల్స్ వంద కోట్ల దాకా జరిగాయన్న వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక్క ఆడియో హక్కులే పదమూడు కోట్లకు అమ్ముడుపోయాయట. మిగిలినవి డబ్బింగ్, రీమేక్, శాటిలైట్ తదితరాలు ఉన్నాయట. ఇది చాలా పెద్ద మొత్తం. ఒకవేళ థియేటర్ కలుపుకుంటే ఈజీగా ఇంకో యాభై తోడవుతుంది. లైగర్ అల్ట్రా డిజాస్టర్ తర్వాత కూడా ఇంత మార్కెట్ జరగడమంటే గొప్పే. అయితే ఇవి నిజంగా అవుతున్నాయా లేక హైప్ కోసం ఈ నెంబర్లు సర్క్యులేట్ చేస్తున్నారా అనేది ఖచ్చితంగా చెప్పలేం.

నిజానికీ కాంబోకి క్రేజ్ ఉన్న మాట వాస్తవమే. లైగర్ ఫలితం ఎలా ఉన్నా విజయ్ దేవరకొండ మార్కెట్ అమాంతం పడిపోలేదు కానీ తన మాటల మీద క్రెడిబిలిటీ తగ్గింది. కానీ ఖుషీలో ఉన్న ఆకర్షణల దృష్ట్యా ప్రమోషన్లు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే మాత్రం మంచి ఓపెనింగ్స్ ని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ కు దీని సక్సెస్ చాలా కీలకం. ఎందుకంటే మీడియం రేంజ్ బడ్జెట్ తో చేస్తున్న సినిమాలు బాగా దెబ్బ తింటున్నాయి. అంటే సుందరానికి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హ్యాపీ బర్త్ డే ఇలా బ్యాకప్ ఇచ్చినవి కూడా గట్టిగానే కొట్టాయి.

ఇప్పుడు తిరుగుతున్న ఈ ఖుషి నెంబర్లు అధికారికంగా చెప్పినవి కాదు కాబట్టి క్లారిటీ కోసం ఇంకొంత కాలం ఆగాల్సిందే. సమంతా పూర్తిగా కోలుకుని వస్తే తప్ప మిగిలిన బ్యాలన్స్ షూట్ ని పూర్తి చేయలేరు. అటుఇటు తిరిగి జనవరి కంటే ముందు మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. శివ నిర్వాణకు టక్ జగదీష్ చేదు అనుభవాన్ని ఇచ్చినప్పటికీ మజిలీ తరహా మేజిక్ మళ్ళీ రిపీట్ చేస్తాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ముఖ్యంగా దీంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మల్లువుడ్ సెన్సేషన్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం మీద భారీ అంచనాలున్నాయి. అందుకే అంత రేట్ పలికిందని టాక్.