Movie News

PS 2 తీసేసుకున్న మహేష్ డేట్

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. తల్లి మరణం తర్వాత ఆ విషాదం నుంచి బయట పడేందుకు విదేశాలకు వెళ్లిన మహేష్ ఇటీవలే తిరిగి వచ్చేశాడు. కొత్త షెడ్యూల్ వివరాలు ఇంకా ఫైనల్ కాలేదు. ఈ లోగా స్క్రిప్ట్ విషయంలో హీరోకి దర్శకుడికి పూర్తి ఏకాభిప్రాయం రాలేదనే వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. నిర్మాత నాగవంశీ ట్వీట్ ద్వారా వాటికి చెక్ పెట్టే ప్రయత్నం చేసినా అందులోనూ సరైన క్లారిటీ లేకపోయింది. మొత్తానికి వెయిటింగ్ అయితే తప్పదు.

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి విడుదల తేదీ గతంలోనే ఫిక్స్ చేశారు. 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ ఉంటుందని అఫీషియల్ గా చెప్పారు. కానీ ఇప్పుడది సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. నవంబర్ లేదా డిసెంబర్ కి షిఫ్ట్ కాక తప్పదని ఒకవేళ అదీ వద్దనుకుంటే హ్యాపీగా 2024 సంక్రాంతికి షిఫ్ట్ అయినా ఆశ్చర్యం లేదని ఘట్టమనేని వర్గాల నుంచి వస్తున్న లీక్. సమ్మర్ లో మంచి డేట్ అది కూడా పోకిరి, అడవిరాముడు, బాహుబలి 2 లాంటి వాటికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన స్లాట్. దాన్ని మిస్ చేసుకోవడం పట్ల ఫ్యాన్స్ ఖచ్చితంగా ఫీలవుతారు.

ఈలోగా పీఎస్ 2 సూపర్ స్టార్ డేట్ ని తీసేసుకుందని చెన్నై అప్ డేట్. ఏప్రిల్ 28 పొన్నియన్ సెల్వన్ రెండో భాగం రావడం కన్ఫర్మ్ అయినట్టే. ఈమేరకు ఇవాళో రేపో అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేస్తారు. తమిళంలో నాలుగు వందల కోట్లు రాబట్టిన ఈ పీరియాడిక్ డ్రామా ఇతర భాషల్లో మాత్రం ఆశించిన స్థాయిలో మేజిక్ చేయలేకపోయింది. అయితే అసలు కథ పీఎస్ 2లోనే ఉంటుందని, ఫస్ట్ పార్ట్ తో సంతృప్తి చెందని వాళ్ళను థ్రిల్ చేస్తుందని మణిరత్నం టీమ్ అంటున్నారు. ఏది ఏమైనా మహేష్ కు ఒక మంచి సీజన్ మిస్ అయినట్టే. పీఎస్ 2 షూటింగ్ ఎప్పుడో అయిపోయింది కాబట్టి వాళ్లకు టెన్షన్ లేదు.

This post was last modified on November 5, 2022 4:03 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

8 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

10 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

10 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

10 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

14 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

14 hours ago