ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలెబ్రిటీ లపై ట్రోలింగ్ అనేది కామన్ అయిపోయింది. సినిమా కంటెంట్ మీద కూడా ట్రోలర్స్ టాలెంట్ చూపిస్తూ రివ్యూస్ ఇస్తున్నారు. తాజాగా దర్శకుడు అనుదీప్ తనపై జరిగిన ట్రోలింగ్ పై రెస్పాన్స్ అవుతూ కామెంట్ చేశాడు. ఇటివల తన డైరెక్షన్ లో వచ్చిన ‘ప్రిన్స్’ పై చాలా ట్రోలింగ్ జరిగిందని ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకున్నాడు. లేకీ కామెడీ అంటూ ట్రోలింగ్ చేశారని, ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా కామెడీ రాసుకుంటానని బహుశ అది అందరికీ నచ్చక పోవచ్చని, క్రిటిసిజం అనేది చాలా కన్స్ట్రక్టివ్ గా ఉండాలి. ఎక్కడెక్కడ నచ్చలేదో చెప్తే బెటర్ చేసుకుంటాను కానీ ఏదో బురద చల్లాలనే మైండ్ సెట్ తో ట్రోలింగ్ చేస్తే అవన్నీ పట్టించుకోనని తెలిపాడు.
ఇక జాతిరత్నాలు సినిమా సక్సెస్ తర్వాత కూడా చాలా మంది లక్కీ గా ఆడేసిందనే కామెంట్స్ చేశారని, లక్కీ గా హిట్ అయింది అంటే ఎట్లా ? నాగ్ అశ్విన్ లక్కీగా లాటరీ లో వచ్చిన డబ్బు పెట్టలేదు. రాహుల్ , దర్శి లక్కీ గా యాక్ట్ చేయలేదు , రధన్ లక్కీ గా మ్యూజిక్ చేయలేదు. ఒక వంద విషయాలు రెండేళ్ళ పాటు జరిగితే జాతిరత్నాలు వచ్చింది. సో ఇలాంటి రాండం స్టేట్ మెంట్స్ ఇచ్చే ముందు వారే ఆలోచించుకోవాలి అంటూ అనుదీప్ రియాక్ట్ అయ్యాడు. ఇకపై మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వనని ఇదే చివరి ఇంటర్వ్యూ అని స్టేట్ మెంట్ ఇచ్చాడు.
డెబ్యూ సినిమా ‘జాతిరత్నాలు’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన అనుదీప్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమాకు కథ -స్క్రీన్ ప్లే అందించాడు. ఆ సినిమా థియేటర్స్ ఫట్టు మనిపించుకొని వారానికే ఓటీటీలోకి వచ్చేసింది. ఇక ప్రిన్స్ గురించి అందరికీ తెలిసిందే. కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ సక్సెస్ ఫుల్ కెరీర్ కి సడెన్ బ్రేక్ వేసింది. జాతిరత్నాలు చూసి మెచ్చుకున్న జనాలే అనుదీప్ రీసెంట్ సినిమాలపై నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా అనుదీప్ మరీ సిల్లీగా కామెడీ రాసుకుంటున్నాడని టికెట్టు కొన్న వాళ్ళే రియాక్ట్ అయ్యారు. ఈ విషయం కుర్ర దర్శకుడు గమనించి తన తదుపరి సినిమాతో మంచి హిట్ కొడితే తిట్టిన వాళ్ళే మళ్ళీ పోగుతారు. ఈ విషయం మర్చిపోయి రివ్యూ లను , ట్రోలర్స్ ని తప్పుబడితే ఎలా ?