Movie News

‘కాంతార’కు 360 ప్రమోషన్

‘కాంతార’ అనేది కన్నడ సినిమా. అది కర్ణాటకలోని ఒక ప్రాంతానికి సంబంధించిన ఆచార సంప్రదాయాల చుట్టూ తిరిగే సినిమా. నేటివిటీ ఫ్యాక్టర్ అందులో కీలకం. ఇక ఈ చిత్ర హీరో కమ్ ప్రొడ్యూసర్ రిషబ్ శెట్టి గురించి మన వాళ్లకు ఏమీ తెలియదు. ఇక ఈ చిత్రానికి తెలుగులో పెద్దగా ప్రమోషన్ కూడా ఏమీ చేయలేదు.

కేవలం మౌత్ టాక్, రివ్యూలు పాజిటివ్‌గా ఉండడం.. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చాలా చర్చ జరగడంతో మన ప్రేక్ష్ఖకుల్లో ఆసక్తి కలిగింది. సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఆల్రెడీ ఈ చిత్రానికి తెలుగులో మాత్రమే రూ.50 కోట్ల వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ ‘కాంతార’ రూ.300 కోట్ల గ్రాస్ మార్కును కూడా దాటేసింది. ఐతే ఈ సినిమా థియేట్రికల్ రన్ మీద నిర్మాతలేమీ ఆశలు వదులకున్నట్లుగా లేరు.

కన్నడలో ఐదో వారంలో, తెలుగు, హిందీ భాషల్లో మూడో వారంలోనూ సినిమా మంచి వసూళ్లు రాబడుతుండడంతో.. ఇప్పుడు ప్రమోషన్ జోరు పెంచుతున్నారు. హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి వివిద రాష్ట్రాల్లో సక్సెస్ టూర్లు చేస్తూ సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో అతడికి అదిరిపోయే ప్రమోషనల్ సపోర్ట్ దొరికింది. దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్, భారతీయులకు కూడా ఎంతో ఇష్టమైన ఏబీ డివిలియర్స్.. ‘కాంతార’ సినిమాను ప్రమోట్ చేయడం విశేషం.

మిస్టర్ 360గా పేరున్న ఏబీకి బెంగళూరు కేంద్రంగా ఆడే రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో, కన్నడిగులతో ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. గత సీజన్‌కు ముందే ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ.. తర్వాతి సీజన్‌కు ఆర్సీబీ సపోర్ట్ స్టాప్‌లో భాగం కాబోతున్నాడు. ఇందుకోసం బెంగళూరుకు వచ్చిన ఏబీ.. రిషబ్‌తో కలిసి ‘కాంతార’ సినిమాకు ఎలివేషన్ ఇచ్చాడు. కాంతార సినిమాను తప్పక చూడండని చెప్పడంతో పాటు ఆ సినిమాలో బాగా పాపులర్ అయిన సౌండ్‌ను రిషబ్‌తో కలిసి రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు. ఇలా ఒక లెజెండరీ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఒక ప్రాంతీయ సినిమాను ప్రమోట్ చేయడం గొప్ప విషయం. ‘కాంతార’ రీచ్ దీని వల్ల మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.

This post was last modified on November 4, 2022 8:50 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

12 hours ago