వైసీపీ అధినేత, సీఎం జగన్ సొంత జిల్లా కడపలో రాజకీయ పరిస్థితులు మారేలా ఉన్నాయనే సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ జిల్లాను రెండుగా విభజిస్తూ.. చేసిన నిర్ణయం ఇక్కడి ప్రజలకు నచ్చలేదనే విషయం తెలిసిందే. రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే, రాయచోటి కేంద్రంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. కానీ, ప్రభుత్వం మాత్రం తాను చేసిన నిర్ణయానికే కట్టుబడింది. ఇప్పుడు ఆవేడి ఇంకా కొనసాగుతూనే ఉందని అంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి కడపలోని 10 నియోజకవర్గాల్లో 5 చోట్ల వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.
వీటిలో రాయచోటి, రాజంపేట, కడప, బద్వేలు, రైల్వేకోడూరుల్లో వైసీపీ వ్యతిరేక పవనాలు జోరుగా వీస్తున్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో పర్వాలేదనే టాక్ ఉన్నా.. ఈ ఐదు నియోజనకవర్గాల్లో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సీఎం జగన్ అయినప్పటికీ.. జిల్లాకు ఒనగూరిన ప్రయోజనం లేదనేది ఇక్కడి ప్రజల టాక్. అదేసమయంలో బస్టాండు వివాదాల్లో ఉండడం కూడా ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తోంది. ఇక, ఉక్కు కర్మాగానికి సీఎం జగన్ శంకు స్థాపన చేసినా.. ఇప్పటి వరకు అడుగులు ముందుకు పడడంలేదు. మరో ఏడాదిలోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ నేతలు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇక, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పులివెందులను టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతోంది.
మరోవైపు.. వైసీపీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం, కీలకమైన నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు వంటివారికి ప్రాధాన్యం లేకుండా చేశారనే వాదన కొన్నాళ్లుగా వినిపిస్తోంది. మంత్రి వర్గంలో పదవులు ఈ ఇద్దరూ ఆశించారు. అయితే, జగన్ వారికి ఇవ్వకపోగా, ఉన్న చీఫ్ విప్‌పదవిని కూడా శ్రీకాంత్‌రెడ్డి నుంచి తీసేశారు. ఇది అంతర్గతంగా నాయకుల మధ్య మనస్పర్థలకు దారితీసింది. పైకి అంతా బాగున్నట్టుగా ఉన్నప్పటికీ.. ఎవరికీ ఒకరంటే ఒకరికి గిట్టడం లేదు. మేడా మల్లికార్జున రెడ్డి పక్క చూపులు చూస్తున్నారనే వాదన కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఎందుకంటే రాజంపేటలో ఈ సారి వైసీపీ గెలిచే పరిస్థితి లేదనిఒక నిర్ణయానికి వచ్చేశారు.
ఇదిలావుంటే, జనసేన కూడా కడపపై ప్రత్యేక ఫోకస్ పెంచింది. ఇటీవల కాలంలో పవన్ ఒకసారి ఇక్కడ పర్యటించారు. స్థానికంగా యువతను చీల్చి వైసీపీకి దెబ్బకొట్టే కార్యక్రమాలకు ఆయన తన వ్యూహాలను అమలు చేయాలని నిర్ణయించారు. మరోవైపు బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ వంటివారు అంతర్గతంగా వైసీపీ నేతలకు టచ్‌లోకి వస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఎలా చూసుకున్నా ఈ సారి వైసీపీకి ఇక్కడ అనుకున్నంత ఈజీ అయితే కాదనేది వాస్తవమేనని అంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరిగే అలవాటు ఉంది. సో.. ఇప్పుడు వైసీపీకి ఆ దెబ్బ తగిలినా ఆశ్చర్యం లేదనే సంకేతాలు వస్తున్నాయి. మరి దీనిని జగన్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.
This post was last modified on November 4, 2022 11:21 am
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…