Movie News

మణిశర్మ బీజీఎంలతో మార్మోగుతున్న ట్విట్టర్

తెలుగులో ఎంతోమంది గొప్ప గొప్ప సంగీత దర్శకులున్నారు. ఐతే వాళ్లలో నేపథ్య సంగీతం విషయంలో అత్యుత్తమ ప్రతిభ చూపించే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు మణిశర్మదే. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్‌తో హీరోకు ఎలివేషన్ ఇవ్వాలంటే మణిశర్మ తర్వాతే ఎవరైనా. 90వ దశకం మధ్య నుంచి ఓ పదేళ్ల పాటు మణిశర్మ హవా ఎలా నడిచిందో తెలిసిందే.

అప్పట్లో ఏ అగ్ర కథానాయకుడి సినిమా అన్నా మణిశర్మనే సంగీత దర్శకుడిగా ప్రిఫర్ చేసేవాళ్లు. ఇక సినిమాలో హీరో ఎలివేషన్ సీన్లు ఉన్నాయంటే చాలు.. ఇక మణిశర్మ విశ్వరూపం చూపించేవాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఒక్కడు లాంటి సినిమాల్లో మణిశర్మ హీరో పాత్రకు ఇచ్చిన థీమ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పట్లో ఇంద్ర… ఇంద్ర అంటూ మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను ప్రేక్షకులు తమ నోటితోనే ప్లే సేసేసేవాళ్లు.

ఇలాంటి సిగ్నేచర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌లు మణిశర్మ లెక్కలేనన్ని ఇచ్చాడు. కేవలం ఆ బీజీఎంలతోనే సన్నివేశాలు హైలైట్ అయిపోయేవి. ఓ రేంజికి వెళ్లిపోయేవి. అలాగని మణిశర్మ హృద్యమైన సన్నివేశాలకు ఫీల్ గుడ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వలేడని కాదు. అందులోనూ ఆయన నైపుణ్యమే వేరు. చూడాలని ఉంది, ఖుషి, అతడు లాంటి సినిమాల్లో నేపథ్య సంగీతం ఎంత ఆహ్లాదంగా, హృద్యంగా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.

ఈ రోజు (శనివారం) మణిశర్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ట్విట్టర్లో ఆయనపై నెటిజన్లు చూపిస్తున్న అభిమానం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఆయన కెరీర్లో అద్భుతమైన పాటలన్నీ తీసుకొచ్చి ట్విట్టర్లో పోసేస్తున్నారు. అంతే కాక.. బ్యాగ్రౌండ్ స్కోర్ కింగ్ అంటూ.. వివిధ సినిమాల్లో ఆయన సన్నివేశాలను ఎలివేట్ చేసిన స్కోర్‌ల తాలూకు బిట్లు కూడా షేర్ చేస్తూ ఆయన్ని కొనియాడుతున్నారు.

This post was last modified on July 11, 2020 5:16 pm

Share

Recent Posts

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

11 minutes ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

1 hour ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

2 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

3 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

5 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

5 hours ago