ప్రస్తుతం రామ్ చరణ్ అభిమానుల చర్చలన్నీ తమ హీరో 16వ సినిమా మీదే ఉన్నాయి. చరణ్ తన 15వ సినిమాను శంకర్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత వాస్తవంగా అయితే ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో జట్టు కట్టాల్సింది. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆ సినిమా పట్టాలెక్కడం లేదు. దీని గురించి చరణ్ వ్యక్తిగత పీఆర్వో శివ చెర్రీ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశాడు. మరి చరణ్.. శంకర్ సినిమా తర్వాత ఎవరితో జట్టు కడతాడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఐతే చాలామంది చెబుతున్న విషయం ఏంటంటే.. చరణ్‌కు ‘రంగస్థలం’ లాంటి ఆల్ టైం బ్లాక్‌బస్టర్ ఇచ్చిన సుకుమార్‌తోనే తన తర్వాతి సినిమా ఉంటుందని. ఐతే ఇప్పటిదాకా ఈ విషయం ఒక ప్రచారం మాత్రమే కాగా.. తాజాగా తెలిసిన ఒక అప్‌డేట్‌ను బట్టి చూస్తుంటే ఈ కలయిక పక్కా అని స్పష్టమవుతోంది.
లెజెండరీ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ తనయుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ అట. అతను తాజాగా క్లబ్‌హౌస్ చాట్‌లో మాట్లాడుతూ.. చరణ్‌తో తన తర్వాతి సినిమాకు సంబంధించి ఇంట్రోను సుకుమార్ ఆల్రెడీ చిత్రీకరించేశాడట. ఇది ‘ఆర్ఆర్ఆర్’ షూట్‌కు ముందే జరిగిందట. అది మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ అని అంటున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ కోసం చరణ్ పెంచిన బాడీ, లుక్ నచ్చి అలాగే తన కొత్త చిత్రం ఇంట్రో సీన్ తీశాడని.. ఇదే లుక్ తర్వాత కావాల్సి ఉంటుందని కూడా చెప్పాడని సాబు సిరిల్ కొడుకు క్లబ్ హౌస్‌లో చెప్పినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుుగతోంది. ఇది నమ్మకూడని విషయం లాగా కూడా అనిపించట్లేదు. ఎందుకంటే ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ల టైంలో రాజమౌళి ఒకసారి మాట్లాడుతూ.. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ చేయబోయే తర్వాతి సినిమాకు సంబంధించి ఇంట్రో సీన్ తనకు తెలుసని, అది మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందని అన్నాడు. దీన్ని బట్టి సుక్కు-చరణ్ కలయిక నిజమే అని, వారి నుంచి ‘రంగస్థలం’ను మించిన సినిమా రాబోతోందని ఆశించవచ్చు.
This post was last modified on November 2, 2022 6:52 pm
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…