వీకెండ్ లో చాలా కీలకమైంది సండే. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు రెండు రోజులు వస్తాయి కాబట్టి శనివారం కౌంట్ చేసుకోవచ్చు కానీ సగటు మధ్యతరగతి జీవులకు, వ్యాపారస్తులకు ఆదివారం ఒక్కటే టైంపాస్ ఆప్షన్. అందుకే ఆ రోజు వసూళ్లు ఏ వీక్ డేతో పోల్చుకున్నా చాలా ఎక్కువగా ఉంటాయి. హిట్ టాక్ వచ్చినవాటికి టికెట్లు దొరకడం కూడా కష్టమే. కానీ ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఐసిసి వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ థియేటర్ కలెక్షన్ల మీద గట్టి ప్రభావమే చూపిస్తోంది. హ్యాపీగా ఇంట్లోనే కూర్చుకుని దేశం తరఫున మద్దతు ఇవ్వడం కన్నా మజా స్పోర్ట్ లవర్స్ ఇంకేం కోరుకుంటారు.
ఇప్పుడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ వంతు వచ్చింది. నేరుగా సెమి ఫైనల్స్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్న మన టీమ్ బ్యాటింగ్ తో ఎదురుదాడికి దిగుతుంది. అటు సఫారీ టీమ్ కూడా ఏం తక్కువ లేదు. అదిరిపోయే స్కోర్లతో ప్రత్యర్థులను బెదరగొడుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా సినిమాలకు వెళ్లే మూడ్ లో జనం ఉండరు. గత ఆదివారం పాకిస్థాన్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ వీరంగం చూశాక బయటికి వెళ్లాలని ఎవరికి అనిపిస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి చాలా షోలకు జనం లేక స్క్రీన్లు వెలవెలబోయాయి. గెలిచాక దీపావళి షాపింగ్ లో బిజీ అయ్యారు.
తిరిగి నవంబర్ 6 ఆదివారం ఇండియాతో జింబాబ్వే తలపడుతుంది. మొన్న ఆ జట్టు ఒక్క రన్ తో పాక్ మీద గెలిచి ఎంత సెన్సేషన్ చేసిందో చూశాంగా. మనం ఫైనల్ వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి అది జరిగే నవంబర్ 13 కూడా సండేనే. ఇలా గ్రౌండ్ లో ప్లేయర్లతోనే కాకుండా థియేటర్లతోనూ ఐసిసి టోర్నమెంట్ గేమ్ ఆడుతోంది. అసలే కాంతార తర్వాత అంత స్థాయిలో ఆడిన సినిమాలు పెద్దగా లేవు. సర్దార్ హిట్టే కానీ బిజినెస్ తక్కువగా చేయడంతో లాభాల బాట పట్టింది. వచ్చే వారం ఊర్వశివో రాక్షసివో, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లు ఉన్నాయి. వీటి మీదా అంచనాలు లేవు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఈ మ్యాచుల ప్రహసనం ఒకటి