Movie News

మ‌హేష్ బాబు.. సౌత్‌లో 1 నేనొక్క‌డినే

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సోష‌ల్ మీడియాలో ఎంత పాపుల‌రో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. టాలీవుడ్ అనే కాక సౌత్ ఇండియాలో మిగ‌తా హీరోల‌కంటే ముందు ట్విట్ట‌ర్ అకౌంట్ ఓపెన్ చేయ‌డ‌మే కాదు.. ముందు నుంచి చాలా యాక్టివ్‌గా ఉంటూ ట్రెండును అందిపుచ్చుకున్నాడు. అక్క‌డ భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇప్ప‌టికీ మ‌హేష్ అంత‌గా ట్విట్ట‌ర్లో యాక్టివ్‌గా ఉండే హీరో మ‌రొక‌రు క‌నిపించ‌రు. త‌న సినిమాల‌నే కాక వేరే వాళ్ల సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డానికి.. ఏవైనా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను పంచుకోవ‌డానికి ట్విట్ట‌ర్‌ను బాగానే ఉప‌యోగించుకుంటాడు మ‌హేష్‌. అందుకే ఎప్ప‌టిక‌ప్పుడు మ‌హేష్‌కు ఫాలోవ‌ర్లు పెరుగుతుంటారు.

తాజాగా సూప‌ర్ స్టార్ ట్విట్ట‌ర్లో అరుదైన ఘ‌న‌త సాధించాడు ఆయ‌న ఫాలోవ‌ర్ల సంఖ్య ఏకంగా 13 మిలియ‌న్ల‌కు చేరుకుంది. సౌత్ ఇండియా మొత్తంలో మ‌రే సెల‌బ్రెటీకి కూడా ట్విట్ట‌ర్లో ఇంత‌మంది ఫాలోవ‌ర్లు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లో ధ‌నుష్ (11.1 మిలియ‌న్ ఫాలోవ‌ర్లు), స‌మంత (10.1 మిలియ‌న్) మాత్ర‌మే మ‌హేష్ బాబుకు చేరువ‌గా ఉన్నారు. వాళ్లు 13 మిలియ‌న్ల మార్కును అందుకునేలోపు మ‌హేష్ 15 మిలియ‌న్ల మార్కును ట‌చ్ చేస్తాడ‌న‌డంలో సందేహం లేదు. ఇక రాజ‌మౌళి సినిమా చేశాడంటే మ‌హేష్ 20 మిలియ‌న్ల మైలురాయిని అందుకోవ‌డానికి ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌క‌పోవ‌చ్చు.

ఇక సౌత్‌లో అత్య‌ధిక ట్విట్ట‌ర్ ఫాలోయింగ్ ఉన్న మిగ‌తా స్టార్ల సంగ‌తి చూస్తే.. అల్లు అర్జున్ 7.2 మిలియ‌న్ల‌తో ఉన్నాడు. రానా ద‌గ్గుబాటి (6.5), జూనియ‌ర్ ఎన్టీఆర్ (6.4), అక్కినేని నాగార్జున (6.3) ర‌జినీకాంత్ (6.2), రాజ‌మౌళి (6), త్రిష (5.6), ప‌వ‌న్ క‌ళ్యాణ్ (5.4)ల‌కు కూడా ట్విట్ట‌ర్లో మంచి ఫాలోయింగే ఉంది. ఐతే వీరిలో చాలామంది ట్విట్ట‌ర్లో మ‌రీ యాక్టివ్‌గా ఏమీ ఉండ‌రు. ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్ల‌ను బ‌ట్టి వాళ్ల ఒరిజిన‌ల్ ఫాలోయింగ్‌ను అంచ‌నా వేయ‌డం కూడా క‌ష్ట‌మే. రామ్ చ‌ర‌ణ్ బ‌య‌ట పెద్ద స్టార్ అయినా.. అత‌ను ట్విట్ట‌ర్లోకి లేటుగా రావ‌డం, పెద్ద‌గా యాక్టివ్‌గా లేక‌పోవ‌డం వ‌ల్ల 2.7 మిలియ‌న్ ఫాలోవ‌ర్లే ఉన్నారు.

This post was last modified on October 28, 2022 9:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

7 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

11 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

11 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

11 hours ago

నిర్మ‌ల‌మ్మ ఎఫెక్ట్‌: ‘పాప్ కార్న్‌’పై ప‌న్ను పేలుడు!

కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలోని జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాల‌క్షేపానికి తినే…

12 hours ago