కాంతార.. కాంతార.. కాంతార.. దాదాపు నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సినిమా ఇది. ముందు కన్నడలో విడుదలై సెన్సేషనల్ హిట్టయిన ఈ చిత్రం.. ఆ తర్వాత ఇతర భాషల వాళ్లనూ ఆకర్షిస్తుండడంతో తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లోనూ అనువాదం చేసి రిలీజ్ చేశారు. తెలుగులో తొలి రోజు నుంచి సంచలన వసూళ్లతో దూసుకెళ్తోందీ చిత్రం. ఇప్పటికే వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.40 కోట్లను దాటిపోగా.. షేర్ రూ.20 కోట్లకు చేరువగా ఉంది. హిందీలో ఈ చిత్రం రూ.30 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.
వసూళ్ల సంగతి పక్కన పెడితే ప్రేక్షకుల మీద ఈ సినిమా వేస్తున్న ఇంపాక్ట్ చాలా బలమైనది, ప్రత్యేకమైంది. ఇంతకంటే పెద్ద హిట్ సినిమాలు, భారీ వసూళ్లు సాధించినవి ఉన్నాయి కానీ… ఈ సినిమా చూపిన ప్రభావం చాలా తక్కువ చిత్రాలే చూపించాయి. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిని సైతం ఈ సినిమా ఆకర్షించింది.
మోడీ కోసం ‘కాంతార’ స్పెషల్ షో వేయబోతున్నారన్నది తాజా సమాచారం. నవంబరు 14న ‘కాంతార’ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టితో కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించబోతున్నారట ప్రధాని. మోడీ సినిమాలు చూడడం చాలా చాలా తక్కువ. చివరగా ఆయన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూశారు. ఆ తర్వాత ఆయన కోసం స్పెషల్ స్క్రీనింగ్ చేయిస్తున్నది ‘కాంతార’ మూవీనే.
కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల ఆచారాలు,అక్కడి వనదేవతలు, భూత కోల నృత్యం.. వీటి చుట్టూ తిరిగే సినిమా ఇది. ఈ సినిమా ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ఈ భూత కోల నృత్యకారులకు నెలవారీ భత్యం ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. హిందూ ఆచారాలను ప్రమోట్ చేసే సినిమా కావడంతో ప్రధాని కూడా సినిమా చూడాలని నిర్ణయించుకుని ఉండొచ్చు. ఇందులో రాజకీయ ప్రయోజనం కూడా కొంత దాగి ఉందన్నది స్పష్టం. మరి ఈ సినిమా చూసి మోడీ ఏమని రివ్యూ ఇస్తారో చూడాలి.
This post was last modified on October 28, 2022 7:42 pm
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సమీపంలోనే జరగబోయే మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలను ముందుగానే…
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా…
టీడీపీ సీనియర్ నాయకురాలు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత… రాజకీయంగా చర్చనీయాంశం అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి…
గేమ్ ఛేంజర్ ఇంకా విడుదలే కాలేదు రామ్ చరణ్ అప్పుడే తన తదుపరి సినిమాను పట్టాలెక్కించేశాడు. సుకుమార్ ప్రియ శిష్యుడు…
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉన్న పార్టీ మార్పుల కేసులో హైకోర్టు సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. బీఆర్ఎస్…