ఆదా శర్మ.. టాలీవుడ్ లో పెద్దగా బిగ్ హిట్స్ చూడకపోయినా కూడా అప్పుడప్పుడు కొన్ని సినిమాలతో టచ్ చేసింది. హార్ట్ ఎటాక్ తో తెలుగు వారికి దగ్గరైన ఈ భామ క్షణం లాంటి సినిమాలతో నటిగా మంచి మార్కులు అందుకుంది.
ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా ఫొటో షూట్స్ తో మాత్రం ఆదా గ్లామర్ డోస్ అస్సలు తగ్గడం లేదు. ఫొటో షూట్ అంటే అందాలను ఆరబోయడమే కాదు అందులో ఎదో కాన్సెప్ట్ హైలెట్ అయ్యేలా చూసుకుంటుంది. రీసెంట్ గా అమ్మడు కెమెరా ట్రిక్కుతో ఫొటో షాప్ ను బాగానే వాడుకుంది.
ఒకవైపు బాడీ మరోవైపు తల వచ్చేలా స్టిల్ ఇచ్చింది. అందులోనూ ఒక మెస్సేజ్ ఇస్తూ సూర్యుడు ప్రతీ ఒక్కరికీ అవసరం అంటూ ఒక మంచి యష్ ట్యాగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఏదేమైనా ఫొటో షూట్స్ తో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ మంచి ఛాన్స్ వస్తే బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ చూడాలని ఎదురుచూస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates