లైగర్ సినిమాకు సంబంధించి నష్టాల భర్తీ విషయంలో ఫినాన్షియర్లు, బయ్యర్లతో దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ గొడవ బాగా ముదురుతున్నట్లే కనిపిస్తోంది. లైగర్ సినిమా కారణంగా దారుణంగా నష్టపోయిన తమకు కొంతమేర నష్టపరిహారం చెల్లిస్తామని ఇచ్చిన హామీని పూరి నిలబెట్టుకోకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా ధర్నా చేయాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించడం.. వారికి కొందరు ఫినాన్షియర్లు, ఎగ్జిబిటర్లు కూడా తోడవడం.. ఈ సమాచారం తెలుసుకున్న పూరి వారికి ఫోన్ కాల్ ద్వారా గట్టి వార్నింగ్ ఇవ్వడం.. ఆ కాల్ తాలూకు ఆడియో లీక్ అయి వైరల్ కావడం తెలిసిందే.
తనను బ్లాక్‌మెయిల్ చేయాలని చూస్తే, తన పరువు తీయాలని చూస్తే ఇస్తానన్న డబ్బు కూడా ఇవ్వబుద్ధి కాదని.. ఎవరు ధర్నా చేస్తారో వారిని మినహాయించి మిగతా వాళ్లకు డబ్బులిస్తానని పూరి ఈ కాల్‌లో తేల్చేశాడు. అంతే కాక ఫైనాన్షియర్ శోభన్ బాబు, డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీనుల వల్ల తనకు ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు పూరి.
ఐతే పూరి ఈ విషయంలో హద్దులు దాటి ప్రవర్తించాడని అవతలి వర్గం అంటోంది. లైగర్ సినిమా మీద తాము పెట్టిన పెట్టుబడిలో మూడో వంతు కూడా వెనక్కి రాలేదని.. కొంత మేర నష్టపరిహారం ఇస్తానన్న పూరి ఆ తర్వాత ఫోన్ ఎత్తడం మానేశాడని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. విధిలేని పరిస్థితుల్లోనే ధర్నాకు సిద్ధమయ్యామని.. దానికి పూరి అంత తీవ్రంగా స్పందించడమేంటని.. పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా తమను బ్లాక్‌మెయిల్ చేయాలని, తమ నోళ్లు మూయించాలని పూరి చూస్తున్నాడని.. డబ్బులు ఎగ్గొట్టే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నాడని ఆ వర్గం ఆరోపిస్తోంది.
టాలీవుడ్ నిర్మాతలు ఇచ్చిన ఎన్నో బౌన్స్ చెక్కులు తమ వద్ద ఉన్నాయని.. తాము కూడా కేసులు పెట్టగలమని ఫైనాన్షియర్ శోభన్ అంటున్నాడు. పూరి తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఫినాన్షియర్ల సంఘం.. ఇకపై ఆయన సినిమాలకు ఫైనాన్స్ చేయకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు సైతం పూరిని బాయ్‌కాట్ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
This post was last modified on October 27, 2022 10:52 pm
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…