Movie News

పవన్.. వదిలేయ్ ప్లీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న, చేయబోయే సినిమాల గురించి గందరగోళం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి ఆయన క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం మీదే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో మొదలైనట్లు తెలుస్తోంది. దీని తర్వాత.. 2024 ఎన్నికలకు ముందు పవన్ ఇంకేదైనా సినిమా చేస్తాడా.. చేస్తే అది ఏ సినిమా అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు.

ఐతే హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనౌన్స్ అయి చాలా కాలం అయిన నేపథ్యంలో దాన్ని పట్టాలెక్కిస్తాడని అభిమానులు చూస్తున్నారు. కానీ ఎన్నికల్లోపు ఇంకో స్ట్రెయిట్ మూవీ అంటే కష్టమని.. దాని బదులు తక్కువ టైంలో ఒక రీమేక్ లాగించేద్దామని పవన్ చూస్తున్నట్లుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

పవన్ కోసం ఆల్రెడీ ఒక రీమేక్ మూవీని సెట్ చేసి పెట్టాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అదే.. వినోదియ సిత్తం. ‘భీమ్లా నాయక్’ తరహాలోనే దీనికి కూడా తెలుగు టచ్ అద్దింది, స్క్రిప్టు రెడీ చేసింది త్రివిక్రమే. ఇందులో పవన్ ఒరిజినల్లో సముద్రఖని చేసిన దైవదూతలో కనిపించబోతుంటే.. తంబిరామయ్య చేసిన మిడిలేజ్డ్ క్యారెక్టర్ని యుకుడిగా మార్చి అందులో సాయిధరమ్ తేజ్‌ను నటింపజేస్తారని ఇంతకుముందే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

ఐతే పింక్, అయ్యప్పనుం కోషీయుం సినిమాలను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్చి.. ఫ్యాన్ మూమెంట్స్ కూడా జోడించారు కానీ. ‘వినోదియ సిత్తం’లో అలాంటి అంశాలకు అస్సలు స్కోప్ లేదు. ఇది ‘గోపాల గోపాల’ తరహాలో డ్రైగానే ఉంటుంది. అందుకే పవన్ అభిమానులు ఈ సినిమా చేయొద్దని కోరుకుంటున్నారు. పైగా ‘వినోదియ సిత్తం’ హిందీ రీమేక్ ‘థ్యాంక్ గాడ్’కు వస్తున్న స్పందన చూశాక వాళ్లలో మరింత వ్యతిరేకత పెరుగుతోంది. ఈ సినిమా హిందీలో తుస్సుమనిపించింది. బ్యాడ్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్ దిశగా అడుగులేస్తోంది. హిందీలో మాస్ టచ్ ఇచ్చినా, మిడిలేజ్డ్ క్యారెక్టర్ని కుర్రాడిగా మార్చినా ఫలితం లేకపోయింది. కాబట్టి పవన్ ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేయడం బెటరనే అభిప్రాయాలను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on October 27, 2022 10:45 pm

Share

Recent Posts

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

37 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

52 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

52 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago