‘ప్రాజెక్ట్ కే’…లక్ష్యం హాలీవుడ్ ?

యూనివర్సల్ స్టార్ హీరో ప్రభాస్ ని పెట్టి నాగ్ అశ్విన్ ఓ బిగ్ ప్రాజెక్ట్ తీస్తున్న సంగతి తెలిసిందే. దీనికి టైటిల్ కూడా ప్రాజెక్ట్ కే అని పెట్టారు. అయితే సినిమా టైం ట్రావెల్ కథతో సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని తెలిసిన విషయమే కానీ తాజాగా థీమ్ తెలిపేలా మేకర్స్ వదిలిన పోస్టర్ మాత్రం సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తుంది.

ముఖ్యంగా నాగ్ ఆశ్విన్ ఈ సినిమాను హాలీవుడ్ సినిమాలకు ధీటుగా పాన్ వరల్డ్ సినిమాగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాడు. తాజాగా ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా సూపర్ పవర్స్ ఉన్న హ్యాండ్ చూపిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ గమనిస్తే ప్రభాస్ ను సూపర్ హీరోగా చూపిస్తూ ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడని అనిపిస్తుంది. మొన్నీ మధ్య అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో కూడా ఓ హ్యాండ్ చూపించారు. ఆ చేతికి క్లాత్ చుట్టి ఉంది. ఆ హ్యాండ్ కూడా ప్రభాస్ దే అనిపిస్తుంది.

ప్రభాస్ ఓ సాదారణ వ్యక్తి నుండి సూపర్ హీరోగా ఎలా మారాడు ? ఎలాంటి యుద్దాలు చేశాడు ? అనేది కథాంశం గా అనిపిస్తుంది. అలాగే పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఎలిమెంట్స్ తో వరల్డ్ సినిమా లవర్స్ కి ఓ ట్రీట్ ఇవ్వనుందని అర్థమవుతుంది. నాగ్ అశ్విన్ ఈ సినిమా కోసం దాదాపు 500 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాడు. ఈ బిగ్ బడ్జెట్ తో హాలీవుడ్ సినిమా ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్నాడన్నమాట.