గత వారం విడుదలైన ‘కాంతార’ టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. విడుదలకు ముందే మంచి బజ తెచ్చుకుని, డీసెంట్ అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఈ సినిమా ఆశ్చర్యపరిచింది. ఇక గత శనివారం రిలీజ్ రోజు అదిరిపోయే టాక్ రావడంతో సాయంత్రానికి ఈ సినిమా హౌస్ ఫుల్స్‌తో రన్ అయింది. ఆదివారం డిమాండ్ పెరిగిపోవడంతో స్క్రీన్లు, షోలు పెంచాల్సిన పరిస్థితి తలెత్తింది. వీక్ డేస్‌లో కూడా వీక్ అవ్వకుండా మంచి వసూళ్లతో సాగిన ఈ చిత్రానికి గత శుక్రవారం అనూహ్యంగా బ్రేక్ పడింది. ఆ రోజు ఒకేసారి ఐదు కొత్త సినిమాలు రిలీజవడంతో ‘కాంతార’కు స్క్రీన్లు తగ్గించక తప్పలేదు.
మల్టీప్లెక్సుల్లో ‘బ్లాక్ ఆడమ్’ మూవీ ‘కాంతార’ స్క్రీన్లు, షోలకు బాగా గండి కొట్టింది. సింగిల్ స్క్రీన్ల నుంచి ఈ సినిమాను లేపేసి ఓరి దేవుడా, జిన్నా, ప్రిన్స్, సర్దార్ చిత్రాలకు కేటాయించాల్సి వచ్చింది. హైదరాబాద్ లాంటి చోట్ల ‘కాంతార’కు మంచి వసూళ్లు వస్తున్న పెద్ద థియేటర్ల నుంచి దాన్ని తీసేశారు.
ఐతే ‘కాంతార’ను రీప్లేస్ చేసిన సినిమాలు ఏవీ కూడా దాని స్థాయిలో వసూళ్లు రాబట్టట్లేదు. కొత్త చిత్రాల్లో ‘సర్దార్’ ఒక్కటే ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని నిలకడగా వసూళ్లు సాధిస్తోంది. తొలి రోజు సాయంత్రానికి ఆ సినిమా బాగా పుంజుకుంది. ‘ఓరిదేవుడా’కు మంచి టాకే వచ్చినా అందుకు తగ్గట్లుగా వసూళ్లు లేవు. ‘ప్రిన్స్’ హడావుడి శుక్రవారం మార్నింగ్ షోలకే పరిమితం అయింది. డివైడ్ టాక్ వల్ల ఈ సినిమా వసూళ్లు పడిపోయాయి. సినిమా పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు.
ఇక మంచు విష్ణు సినిమా ‘జిన్నా’కు టాక్ బాగానే ఉన్నా.. ఈ పోటీ మధ్య ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అటెన్షన్ దక్కట్లేదు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో భారీ వసూళ్లు సాధిస్తున్న సంధ్య థియేటర్ నుంచి ‘కాంతార’ను తీసేసి.. నారాయణగూడలోని శాంతికి ఆ సినిమాను పరిమితం చేశారు. ఇప్పుడు సంధ్యలో ఆడుతున్న రెండు సినిమాలు ప్రిన్స్, జిన్నా కలిపి కూడా ‘కాంతార’ గురువారం వరకు ఒక్కో షోకు రాబట్టిన వసూళ్లు తెచ్చుకోలేకపోతున్నాయి. చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రేక్షకులు ఆదరిస్తున్న సినిమాకు అన్యాయం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on October 23, 2022 3:10 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…