Venkatesh in Ori Devuda
నిన్న విడుదలైన ఓరి దేవుడాకు డీసెంట్ ఓపెనింగ్స్ దక్కాయి. తమిళ బ్లాక్ బస్టర్ ఓ మై కడవులే రీమేక్ గా రూపొందిన ఈ ఫిక్షన్ కం లవ్ ఎంటర్ టైనర్ కు ఒరిజినల్ వెర్షన్ డీల్ చేసిన అశ్వత్ మారిముత్తునే దర్శకత్వం వహించాడు. షూటింగ్ జరుగుతున్నన్నాళ్లు దీని మీద పెద్దగా అంచనాలేం లేవు కానీ విక్టరీ వెంకటేష్ ఇందులో స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నారనే వార్త బయటికి వచ్చాక ఒక్కసారిగా దగ్గుబాటి అభిమానుల అటెన్షన్ దీనివైపుకు మళ్లింది. ఎఫ్3 బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి తమ హీరోని బిగ్ స్క్రీన్ మీద చూసుకోవచ్చన్న ఆనందం థియేటర్ల వద్ద బ్యానర్లు బాణాసంచాలతో పెద్ద హడావిడే చేయించింది.
సినిమా బాగుందనే టాక్ వచ్చినప్పటికీ ఇందులో వెంకీ టైటిల్ రోల్ చేశారనే మాట జనంలోకి బలంగా వెళ్లలేకపోయింది. ముంబైలో సల్మాన్ ఖాన్ కిసీకి భాయ్ కిసీకి జాన్ షూటింగ్ లో బిజీగా ఉండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు తదితరాలకు వెంకటేష్ వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయారు. దీంతో ఆ ప్రభావం కొంత ఓపెనింగ్ మీద పడింది. పోస్టర్లోనూ ఈయన్నే హై లైట్ చేసినప్పటికీ సినిమా మొత్తం ఉండరనే క్లారిటీ జనానికి ముందే ఉంది. బాగుందంటే అప్పుడు చూద్దాంలెమ్మని ఆగిపోయిన ఆడియన్స్ చాలానే ఉన్నారని నిన్న వసూళ్లను బట్టి అర్థమవుతోంది.
ఇక లెన్త్ విషయానికి వస్తే వెంకీ దాదాపుగా ఫస్ట్ హాఫ్ కే పరిమితం కావడం, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ తప్ప మిగిలిన భాగంలో కథ పరంగా అవకాశం లేకపోవడం ఫ్యాన్స్ ని కొంత నిరాశపరిచినప్పటికీ ఓవరాల్ గా వెంకటేష్ ఇచ్చిన ఇంపాక్ట్ చాలా మేలు చేసింది. నిజానికి ఒరిజినల్ వెర్షన్ చూడని లేదా అవగాహన లేనివాళ్లు ఇందులో దేవుడి పాత్ర గోపాల గోపాలలో పవన్ కళ్యాణ్ రేంజ్ లో ఉండొచ్చని ఆశించారు. కానీ దానికి భిన్నంగా నిడివి పరిమితమయ్యింది. ఇప్పుడీ ఫస్ట్ వీకెండ్ ఓరి దేవుడాకు కీలకంగా మారనుంది. ఎలాగూ వచ్చే వారం చెప్పుకోదగ్గ రిలీజులు లేవు కాబట్టి సరిగ్గా వాడుకుంటే హిట్టు పడినట్టే.
This post was last modified on October 22, 2022 12:37 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…