దీపావళి స్పెషల్ గా అక్టోబర్ 21న నాలుగు సినిమాలు థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. వాటిలో రెండు తమిళ్ సినిమాలు కాగా మరో రెండు డైరెక్ట్ తెలుగు సినిమాలు. కార్తి ‘సర్దార్’తో పాటు శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ కూడా దివాళి కానుకగా రిలీజ్ అవుతుంది. కోలీవుడ్ లో దీపావళి రోజు ఈ రెండు సినిమాలతో పోటీ పడుతున్న కుర్ర హీరోలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా పోటీ పడబోతున్నారు.
కార్తి ‘సర్దార్’ డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అవుతుంది. శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ బైలింగ్వెల్ సినిమాగా తెరకెక్కింది. దీనికి జాతిరత్నాలు ఫేం అనుదీప్ దర్శకుడు కావడంతో తెలుగులోనూ ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. పైగా శివ కార్తికేయన్ ప్రీవియస్ రెండు సినిమాలు తెలుగులో మంచి విజయం సాధించాయి. అందుకే ప్రిన్స్ పై అంచనలు ఏర్పడ్డాయి. ఇక సర్దార్ లో కార్తి డ్యూయల్ రోల్ చేయడంతో ఈ సినిమాపై కూడా మంచి బజ్ ఉంది. కాకపోతే ప్రమోషన్స్ పరంగా ఇద్దరూ స్లో గానే ఉన్నారు.
అక్టోబర్ 21న విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’, విష్ణు మంచు ‘జిన్నా’ కూడా రిలీజ్ అవుతున్నప్పటికీ అందరి చూపు కోలీవుడ్ హీరోలపైనే ఉంది. ఈ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కుర్ర హీరోలు ఎలా అలరిస్తారు ? ఇక్కడ అక్కడ ఎలాంటి హిట్స్ అందుకుంటారు అనేది టాపిక్ అవుతుంది. మరి దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చిచ్చుబుడ్డిలా పేలే కోలీవుడ్ హీరో ఎవరో చూడాలి.
This post was last modified on October 19, 2022 5:59 pm
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…