వేదికల మీద, బయట మాట్లాడేటపుడు బాగా తడబడే నందమూరి బాలకృష్ణతో టాక్ షో, అందులోనూ ఓటీటీలో అన్నపుడు చాలామంది ఇది ఏమాత్రం సక్సెస్ అవుతుందో అని సందేహించారు. కానీ ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ ‘అన్ స్టాపబుల్’ షోలో అదరగొట్టాడు బాలయ్య. ప్రస్తుతం తెలుగులోనే కాదు.. ఇండియా మొత్తంలో టాప్ టాక్ షోల్లో ఒకటిగా అవతరించింది ‘అన్ స్టాపబుల్’.
ఈ షో రెండో సీజన్ తొలి ఎపిసోడ్‌కు మామూలు రెస్పాన్స్ రాలేదు. మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌లతో బాలయ్య ఈ ఎపిసోడ్లో బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. వ్యక్తిగత విషయాలే కాక రాజకీయాలకు సంబంధించి వివాదాస్పద అంశాల చుట్టూ తిరిగిన ఈ ఎపిసోడ్ సూపర్ హిట్టయింది. ఇక ఈ సీజన్ రెండో ఎపిసోడ్లో విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ సందడి చేయబోతున్న విషయం వెల్లడైంది.
ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో కూడా బయటికి వచ్చింది. ఆ ప్రోమోలో అందరినీ ఆకర్షించిన విషయం.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో బాలయ్య ఫోన్ కాల్ మాట్లాడ్డమే. మీరెప్పుడు షోకు వస్తున్నారు అని బాలయ్య అడిగితే.. మీరు రమ్మంటే ఇప్పుడే వచ్చేస్తా అని త్రివిక్రమ్ చెప్పడం విశేషం. కాగా త్రివిక్రమ్ ఆ మాట అన్నపుడు.. బాలయ్య కొంచెం ఆగి తెలుసుగా ఎవరితో కలిసి రావాలో అని వ్యాఖ్యానించాడు. ఈ పాయింట్ ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
త్రివిక్రమ్ ఎవరితో కలిసి వస్తాడన్నది డిస్కషన్ పాయింట్‌గా మారింది. కచ్చితంగా ఆ వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణే అయి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ సీజన్ చివరి ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ అతిథిగా వస్తాడని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు త్రివిక్రమ్ షోకు రాబోతున్నట్లు, ఆయనకు తోడుగా మరో వ్యక్తి రాబోతున్నట్లు దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేసింది. నిజంగా పవన్ కళ్యాణ్ ఈ షోలో పాల్గొంటే మాత్రం అది మరో బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ అవుతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on October 16, 2022 3:46 pm
తెలుగు దేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో…
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్‌కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…
హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్(ఈడీ) పై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.…
కూటమి ప్రభుత్వం 11 మాసాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సహజంగానే ప్రభుత్వం ఏం చేసిందన్న విషయంపై చర్చ జరుగుతుంది. అయితే..…
"మీ మీ బ్యాంకు ఖాతాలను మరోసారి అప్ డేట్ చేసుకోండి" అంటూ.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్న దాతలకు సూచించింది.…