పేరుకి శుక్ర శనివారాల్లో తొమ్మిది సినిమాలు రిలీజవుతున్నాయి కానీ అందులో ఖచ్చితంగా రికమండ్ చేయగలిగింది ప్రస్తుతానికి కాంతారా ఒకటే. మిగిలినవి పూర్తిగా మౌత్ టాక్ తో పాటు రివ్యూల మీద ఆధారపడాల్సిందే. కన్నడలో సంచలన విజయం నమోదు చేసుకున్న ఈ విలేజ్ డ్రామాకు ఓవర్సీస్ లోనూ బ్రహ్మరథం దక్కింది. కెజిఎఫ్ 1, 2 తర్వాత ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టిన మూడో శాండల్ వుడ్ మూవీగా కొత్త చరిత్ర సృష్టించింది. ఇందులో ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేదు. విజువల్ ఎఫెక్ట్స్ ఉండవు. కళ్లుచెదిరే యాక్షన్ ఎపిసోడ్స్ అసలే లేవు. అయినా కూడా జనానికి విపరీతంగా ఎక్కేసింది.
ఏకంగా వంద కోట్ల గ్రాస్ కు అతి దగ్గరగా వెళ్లి 777 ఛార్లీని దాటేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో నేటివిటీ మన ఆడియన్స్ ఏ మేరకు కనెక్ట్ అవుతుందనేది ఆసక్తికరింగా మారింది. శాండల్ వుడ్ లో ఆదరించినంత మాత్రాన మనదగ్గరా అదే రెస్పాన్స్ వస్తుందని చెప్పలేం కానీ కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నిరాశపరచలేదు. అయితే కాంతారాలో నేటివిటీ, సంప్రదాయాలు, ఆచారాలు అన్నీ పురాతన కాలం నుంచి కన్నడిగులకు సంబంధించినవి. చూసినవాళ్లు థ్రిల్ అవ్వడం ఖాయమే కానీ ఇక్కడి మాస్ కి నచ్చడం మీద ఫలితం ఆధారపడి ఉంటుంది.
ఈ కాంతారా హవా ఏ రేంజ్ లో ఉందంటే కర్ణాటకలో వారం తర్వాత రిలీజైన గాడ్ ఫాదర్ దీని వల్లే ప్రభావితం చెందాల్సి వచ్చింది. మొదటిసారి అక్కడ చిరంజీవి బొమ్మ మెగాస్థాయిలో ఆడలేదన్నది అక్కడి నుంచి వస్తున్న రిపోర్ట్. ఒకవేళ ఈ కాంతారా లేకపోయి ఉంటే మెగాస్టార్ ర్యాంపేజ్ ఇంకోలా ఉండేదని దశాబ్దాలుగా చిరు సినిమాలతో బిజినెస్ చేస్తున్న ఒక ట్రేడ్ నిపుణుడు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బి,సి సెంటర్స్ దీని ప్రభంజనం మాములుగా లేదు. ప్రమోషన్ విషయంలో మరీ అగ్రెసివ్ గా వెళ్ళకపోవడం కాంతారాకు బాగా కలిసి వచ్చింది. మరి టాలీవుడ్లో ఇదేం మేజిక్ చేయనుందో.
This post was last modified on October 13, 2022 6:41 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…